Home గాసిప్స్ ఇంకా రిలీజే కాలేదు…అప్పుడే మరో రీమేక్ కి సై!!

ఇంకా రిలీజే కాలేదు…అప్పుడే మరో రీమేక్ కి సై!!

1029
0

టాలెంట్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్స్ లేని బాలీవుడ్ హీరోల్లో షాయిద్ కపూర్ కూడా ఒకరు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్కెట్ ని సొంతం చేసుకోలేక పోయిన షాయిద్ కపూర్ సంజయ్ లీల భన్సాలీ డైరెక్షన్ లో చేసిన పద్మావత్ మూవీ లో నటించిన కానీ పెద్దగా పేరు అయితే రాలేదు, కానీ ఇవన్నీ ఒక్క సినిమా తో తీరిపోయాయి. ఆ సినిమా నే అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్…

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లోనే హిందీ లో రీమేక్ అయిన కబీర్ సింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని 270 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకోగా షాయిద్ కపూర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

దాంతో ఇప్పుడు మరోసారి తెలుగు లో సూపర్ హిట్ అయిన నాని జెర్సీ సినిమా ను హిందీ లో అదే పేరు తో రీమేక్ చేస్తుండగా ఈ సినిమా కూడా అక్కడ సంచలనం సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత కూడా మరోసారి రీమేక్ నే నమ్ముకున్నాడని లేటెస్ట్ టాక్.

ఇంకా రిలీజ్ కూడా కానీ తమిళ్ తెలుగు లో రూపొందిన సూర్య నటించిన ఆకాశామే నీ హద్దుగా సినిమా స్టొరీ పాయింట్ గురించి తెలుసుకుని ఆసక్తి కలగడం తో రీమేక్ కి ఓకే చెప్పాడని లేటెస్ట్ గా బాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. సూర్య ప్రస్తుతం ఫ్లాఫ్స్ లోనే ఉన్నా కానీ ఈ సినిమా తో…

కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్ ఉంది, దాంతో షాయిద్ కపూర్ కూడా మళ్ళీ కొత్త కథతో రిస్క్ ఎందుకని రిలీజ్ కూడా కానీ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని తీసుకోమని నిర్మాత కి చెప్పాడని అంటున్నారు. రిలీజ్ అయ్యాక రిజల్ట్ ని బట్టి ఫైనల్ డిసిషన్ ఉంటుందని టాక్. ఇంతలో జెర్సీ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట షాయిద్ కపూర్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here