బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ సినిమాలు పడటం లేదు, ఒకటి రెండు మంచి హిట్స్ పడుతున్నా కూడా వరుస పెట్టి నిరాశ కలిగించే సినిమాలు వస్తూ ఉండగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్కై ఫోర్స్ సినిమా సైతం ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్స్ నే సాధించినా కూడా అందులో కార్పోరేట్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి.
ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో మమ్మోత్ బ్లాక్ బస్టర్ కొట్టి తర్వాత మళ్ళీ ఫామ్ కోల్పోయిన షాహిద్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అయిన దేవ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
పక్కా కమర్షియల్ మాస్ సీన్స్ తో నిండిపోయిన సినిమా బాలీవుడ్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది, షాహిద్ కపూర్ కి మంచి మాస్ హిట్ గా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో షాహిద్ కపూర్ పెర్ఫార్మెన్స్ కి మంచి పేరు అయితే వచ్చింది కానీ…
ఆడియన్స్ నుండి సినిమాకి మాత్రం నెగటివ్ టాక్ నే సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి క్రియేట్ చేయలేక పోయింది ఈ సినిమా…మొదటి రోజున 5.78 కోట్లు, రెండో రోజు 6.61 కోట్లు, మూడో రోజు 7.04 కోట్లు, 4వ రోజున 2.50 కోట్లు అలాగే…
5వ రోజున 2.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ నే అందుకున్న సినిమా టోటల్ గా 5 రోజుల్లో 24.13 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను అందుకుంది. ఈ సినిమా తో సూపర్ హిట్ కొడతాడు అనుకున్న షాహిద్ కపూర్ కి తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అయ్యేలా చేసింది ఈ సినిమా…