Home న్యూస్ శైలజ రెడ్డి అల్లుడు న్యూ రిలీజ్ డేట్…గట్టిగా కొట్టాలి చైతు

శైలజ రెడ్డి అల్లుడు న్యూ రిలీజ్ డేట్…గట్టిగా కొట్టాలి చైతు

949
0

స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్నా సరైన విజయాల కోసం ఎదురు చూస్తున్న హీరోలలో నాగచైతన్య ఒకరు….ప్రేమమ్ మరియు రారండోయ్ వేడుక చూద్దాంతో ఆకట్టుకున్నా తర్వాత చేసిన సినిమాలు ప్రేక్షకులను అభిమానులను భారీగా నిరాశ పరిచాయి. ఇలాంటి సమయంలో సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి తో సినిమా ఒప్పుకున్నాడు నాగచైతన్య.

రమ్యకృష్ణ అత్త రోల్ లో శైలజారెడ్డి అల్లుడు పేరుతో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని టీసర్ ని రిలీజ్ చేయగా రెండింటికి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఇక సినిమాను ఈ నెల 31 న రిలీజ్ అనుకున్నా కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు.

ఇక ఇప్పుడు అఫీషియల్ గా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. వినాయకచవితి కానుకగా సినిమాను సెప్టెంబర్ 13 న అత్యంత భారీగా రిలీజ్ చేయబోతున్నారట. మరి ఈ సినిమా తో అయినా నాగచైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా కొట్టాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here