బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు అంచనాలను అందుకోక పోతే నష్టాలు రావడం అన్నది కామన్ అనే చెప్పాలి. ఇప్పుడు డిజిటల్ అండ్ ఇతర రైట్స్ ద్వారా ఎక్కువ మొత్తం రిటర్న్ వస్తూ ఉండటంతో నిర్మాతలు కొంచం సేఫ్ అవుతున్నారు, కానీ కొన్నేళ్ళ క్రితం కొన్ని సినిమాలకు ఊహకందని నష్టాలను సొంతం చేసుకున్నాయి.. అలాంటి సినిమాలలో ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా కూడా ఒకటి…
భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యి భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా పరాజయంపై పలు మార్లు కామెంట్ చేసిన నిర్మాత అశ్వనీదత్ రీసెంట్ గా మరోసారి సినిమా పరాజయంపై కామెంట్ చేశారు…
ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా 32 కోట్ల మేర నష్టాన్ని సొంతం అయ్యేలా చేసిందని, ఈ సినిమా దెబ్బకి సినిమాలే చేయొద్దు అనుకున్నానని, కానీ మనసు మార్చుకున్నా కొత్త సినిమా చేయడానికి 5 ఏళ్ల టైం పట్టిందని చెప్పుకొచ్చారు నిర్మాత… కానీ అప్పటి ట్రేడ్ లెక్కల్లో ఈ సినిమా మొత్తం మీద…
45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కింది అని నిర్మాతే చెప్పగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 19.5 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. థియేట్రికల్ రన్ లో 42 కోట్ల బిజినెస్ కి 22.50 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుందని సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ లాంటివి రిలీజ్ కి ముందే బిజినెస్ జరిగాయని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. మరి ఇవన్నీ కాకుండా 32 కోట్ల రేంజ్ నష్టం లెక్కలు నిర్మాతకే తెలియాలి.