Home న్యూస్ షాంగ్ చీ టాక్ అండ్ ఫస్ట్ డే ఇండియా కలెక్షన్స్…కుమ్మింది సినిమా!!

షాంగ్ చీ టాక్ అండ్ ఫస్ట్ డే ఇండియా కలెక్షన్స్…కుమ్మింది సినిమా!!

7243
0

మార్వెల్ యూనివర్స్ ఫేస్ 2 స్టార్ట్ అయింది… అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఫేస్ 1 కంప్లీట్ అవ్వగా ఇప్పుడు ఫేస్ 2 లో భాగంగా కొత్త సినిమాలు రాబోతున్నాయి… అందులో ముందుగా షాంగ్ చీ సినిమా రీసెంట్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వగా ఇండియా లో కూడా డబ్ వర్షన్ లతో రిలీజ్ అయిన ఈ సినిమా కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ టేకింగ్ అండ్ యాక్షన్ సీన్స్ గ్రాఫిక్స్ అద్బుతంగా ఉండటం తో…

ఓవరాల్ గా పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో ఉంది… యాక్షన్ సీన్స్ అండ్ గ్రాఫిక్స్ కోసం ఈజీగా సినిమా చూసేయోచ్చు… బస్ ఫైట్, ఫైట్ క్లబ్ సీన్ తర్వాత ఫైట్ మేజర్ హైలెట్స్… కథ అంత పకడ్బందీగా లేకున్నా సీన్ టు సీన్ విజువల్స్ అద్బుతంగా ఉండటం తో సినిమా బాగానే మెప్పిస్తుంది….

ఓవరాల్ గా మార్వెల్ లో ఇది వరకు వచ్చిన మూవీస్ తో పోల్చితే కథ బలంగా లేదు కానీ రీసెంట్ ఫ్లాఫ్ బ్లాక్ విడో కన్నా బెటర్ మూవీ అని చెప్పొచ్చు. ఇక ఇండియా లో ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసింది అని చెప్పాలి.

ఓవరాల్ గా మొదటి రోజు ఇండియా లో 3.2 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ బెల్ బాటం కన్నా బెటర్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక్కడ విశేషం ఎంతంటే తెలుగు రాష్ట్రాల నుండి సినిమా కి సాలిడ్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ రూపంలో రావడం…

మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది, ఈ కలెక్షన్స్ లో తెలుగు డబ్ మరియు ఇంగ్లీష్ వర్షన్ ల కలెక్షన్స్ కలిపి ఉన్నాయి. ఓవరాల్ గా ఇండియా లో సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here