Home Uncategorized హిట్ కొట్టి 7 ఏళ్ళు…సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు…అయినా కొత్త సినిమా కి ఈ...

హిట్ కొట్టి 7 ఏళ్ళు…సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు…అయినా కొత్త సినిమా కి ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఏంటి సామి!!

4044
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో హిట్ కి దూరంగా ఉంటూ వస్తున్న హీరోల్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా ముందు నిలిచే హీరో అని చెప్పొచ్చు. క్లీన్ హిట్ కి ఆల్ మోస్ట్ 7 ఏళ్ల దూరంగా ఉంటూ వస్తున్నాడు కింగ్ ఖాన్… 2014 లో హ్యాప్పీ న్యూ ఇయర్ సినిమాతో చివరి హిట్ ని అందుకున్న షారుఖ్ ఖాన్… మళ్ళీ ఇప్పటి వరకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అయితే అందుకోలేదు అనే చెప్పాలి. ఇక ఇక్కడ విచిత్రం…

ఏంటంటే…. షారుఖ్ ఖాన్ నటించిన చివరి సినిమా జీరో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆల్ మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది, అయినా కానీ షారుఖ్ కొత్త సినిమా పై క్రేజ్ మరో లెవల్ లో ఉండగా రెమ్యునరేషన్ పరంగా కూడా రికార్డ్ స్థాయి లో రెమ్యునరేషన్ ని షారుఖ్ కొత్త సినిమా కి…

గాను సొంతం చేసుకోబోతున్నారని సమాచారం. షారుఖ్ సినిమాలకు టాక్ కి అతీతంగానే అద్బుతమైన బిజినెస్ జరుగుతూ ఉంటుంది, పెట్టిన డబ్బు కి సాలిడ్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, అందుకే తానూ నిర్మాతగా మారి లేటెస్ట్ మూవీస్ కి ఒక నిర్మాతగా ఉంటూ వస్తున్నాడు షారుఖ్. ప్రస్తుతం యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో..

జాన్ అబ్రహం తో కలిసి షారుఖ్ చేస్తున్న కొత్త సినిమా పటాన్…. అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావొచ్చు. ఇక ఈ సినిమా కి గాను షారుఖ్ ఖాన్ రికార్డ్ లెవల్ లో ఏకంగా 95 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారని ఫైనల్ రెమ్యునరేషన్ లెక్క 100 కోట్ల మార్క్ ని కూడా అందుకోవచ్చు అంటూ…

బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 ఏళ్ళుగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకున్నా కానీ షారుఖ్ కి ఉన్న క్రేజ్ పవర్ కి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తో షారుఖ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here