Home గాసిప్స్ శ్యామ్ సింగరాయ్@40 కోట్లు…టాలీవుడ్ షాక్!!

శ్యామ్ సింగరాయ్@40 కోట్లు…టాలీవుడ్ షాక్!!

981
0

నాచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీస్ లైనప్ సాలిడ్ గా ఉన్న విషయం తెలిసిందే, ప్రస్తుతం చేసిన వి ది మూవీ తర్వాత ఏకంగా 4 కొత్త సినిమా లతో వస్తున్న నాచురల్ స్టార్ వేటికవే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు ప్రతీ సినిమా తో కొత్తదనం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు, అప్ కమింగ్ 4 సినిమాల్లో భారీ లెవల్ లో రూపొందుతున్న సినిమా శ్యాం సింగ రాయ్.

రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అంట. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతుంది అంటున్న ఈ సినిమా సౌత్ అన్ని భాషల్లో డబ్ అవ్వడం ఖాయమని, తర్వాత ఫైనల్ గా హిందీ డబ్ చేయాలా లేక అక్కడ రిలీజ్ చేయాలా…

అన్న నిర్ణయాన్ని తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 40 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ కాగా ఈ సినిమా నాచురల్ స్టార్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా లో నాని కి జోడి గా సాయి పల్లవి ని సెలెక్ట్ చేశారట. ఇక త్వరలోనే సినిమా కోసం ఒక కోల్కతా బేసుడ్ భారీ సెట్ ని హైదరాబాదు లో ఏర్పాటు చేస్తారని అంటున్నారు. యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తో నాని నటుడిగా మరింత పేరు తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.

కేవలం 40 కోట్ల రేంజ్ లో ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో మూవీ నిర్మాణం అది కూడా మంచి స్టార్ కాస్ట్ తో ఎలా చేస్తారో అని టాలీవుడ్ మొత్తం ఆశగా ఎదురు చూస్తుంది. ఈ ఇయర్ ఎండ్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here