బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి బాలీవుడ్ లో న్యూ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ఇప్పుడు 3 వారాలను పూర్తీ చేసుకోగా 3 వారాలు ఎలాంటి పోటి లేకుండా బాక్స్ ఆఫీస్ ను దున్నేసిన ఈ సినిమాకి ఈ లాస్ట్ వీక్ లోనే అల వైకుంఠ పురంలో హిందీ రీమేక్ శేహ్జాదా నుండి పోటి ఉండాల్సింది కానీ….
పఠాన్ దూకుడుని తట్టుకోలేక ఒక వారం పోస్ట్ పోన్ చేసుకుని ఈ వారం పోస్ట్ పోన్ చేసుకున్నారు…. కానీ పఠాన్ టీం సినిమా ఎక్కడ స్లో అవుతుందో అని కొత్త ఆఫర్ ను పెట్టారు… నేషనల్ వైడ్ గా ఈ రోజు సినిమా టికెట్ రేటు 110 మాత్రమే అంటూ కొత్త స్టాటజీని…
పెట్టగా ఈ సినిమాకి తిరిగి ఆడియన్స్ నుండి అద్బుతమైన బుకింగ్స్ తో రెస్పాన్స్ వస్తూ ఉండగా శేహ్జాదా బుకింగ్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇలాంటి టైంలో చేసేదేమీ లేక ఈ సినిమా నేషనల్ వైడ్ గా మల్టిప్లెక్సులలో ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అంటూ కొత్త స్కీంని పెట్టారు..
టీం ప్లాన్ ఏంటి అంటే…ఫస్ట్ డే ఇలా ఆఫర్ పెడితే రెండో రోజు నుండి మౌత్ టాక్ స్పేడ్ అయితే కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని ప్లాన్ వేసినా ఫస్ట్ డే 1+1 వలన ఒక టికెట్ డబ్బులు వచ్చినా మరో టికెట్ ఫ్రీ వలన వచ్చిన డబ్బులు జీరో అవుతాయి. దాంతో పఠాన్ టీం ప్లాన్ ని తిప్పి కొట్టినా శేహ్జాదా టీంకి మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఎదురు దెబ్బ కన్ఫాం అనే చెప్పాలి.