తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమా హిందీ లో అఫీషియల్ గా శెహ్ జాదా పేరుతో రీమేక్ అవ్వగా సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. ఎన్ని ప్రమోషన్స్ చేసినా సినిమా కి అనుకున్న రేంజ్ లో బజ్ ఏర్పడలేదు… దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ తో పోల్చితే చాలానే మార్పులతో రిలీజ్ అయింది అని చెప్పొచ్చు…
సినిమాలో పాటలను సగం వరకు తగ్గించగా సెకెండ్ హీరోయిన్ రోల్ మొత్తం కట్ చేశారు, దాంతో లెంత్ క్రిస్ప్ గా ఉన్నప్పటికీ కూడా మిగిలిన సీన్స్ లో సెకెండ్ హీరో క్యారెక్టర్ ని మరీ నీరసంగా చూపించగా మిగిలిన సినిమా మొత్తం ఒరిజినల్ లో ఉన్నట్లే…కట్ అండ్ పేస్ట్ గా తెరకెక్కించారు…. కానీ ఇదంతా ఒరిజినల్ చూసిన వాళ్ళకి…..
చూడని హిందీ ఆడియన్స్ కి మాత్రం సినిమా ఉన్నంతలో ఎంటర్ టైన్ బాగానే చేసేలా మెప్పించవచ్చు, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఒరిజినల్ చూడని హిందీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుంది అని చెప్పాలి… కానీ ఒరిజినల్ ని ఆల్ రెడీ చూసిన వాళ్ళకి మాత్రం సినిమా ఒరిజినల్ లో ఉన్న కనెక్ట్ మిస్ అయినట్లు అనిపించడం ఖాయం….
సీన్ బై సీన్ వస్తూ వెళుతూ ఉండగా ప్రతీ సీన్ లో అల్లు అర్జున్ తో కార్తీక్ ఆర్యన్ ని కంపేర్ చేయడం ఖాయం, అలా చేయడంతో సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది. ఒరిజినల్ చూడని వాళ్ళకి సినిమా ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో అనిపించడం ఖాయం అన్న టాక్ అయితే సినిమా కి సొంతం అయ్యింది.. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.