రిలీజ్ కి ముందు వరకు సినిమాలు ఆడియన్స్ ముందుకు అనుకున్న విధంగా వస్తాయో లేవో అన్న డౌట్ లు ఉండటం కామన్, ఫైనాన్స్ డబ్బుల ఇబ్బందుల వలన సినిమాల రిలీజ్ లపై ఇంపాక్ట్ అప్పుడప్పుడు గట్టిగా ఉండి సినిమా రిలీజ్ లు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటివే రీసెంట్ గా కోలివుడ్ లో మంచి బజ్ నడుమ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అయిన శింభు నటించిన లేటెస్ట్ మూవీ మానాడు సినిమా విషయంలో జరిగింది.
ఈ సినిమా ఫైనాన్స్ ఇబ్బందుల వలన సినిమా రిలీజ్ రోజు అనేక ఇబ్బందులను ఎదురుకుని చివరి నిమిషం వరకు అసలు సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదా అన్న అనుమానాలు రేకెత్తించింది… చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ఇక ఆగిపోయింది అని అనౌన్స్ కూడా చేశారు.
దాంతో ఈ సినిమాతో సంచలనాలు సృష్టిస్తాడు అనుకున్న శింభు ఫ్యాన్స్ అందరూ కూడా టెన్షన్ లో ఉండగా చివరి నిమిషంలో ఎలాగోలా పరిస్థితులు అన్నీ సెట్ చేసిన మేకర్స్ తెలుగు రిలీజ్ ను మాత్రం పోస్ట్ పోన్ చేసి తమిళ్ రిలీజ్ ను యాసిటీస్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు.
దాంతో సినిమా ఎట్టకేలకు చివరి నిమిషంలో ఆడియన్స్ ముందుకు రాగా ఆడియన్స్ నుండి సినిమా కి రెస్పాన్స్ అక్కడ సూపర్ పాజిటివ్ గా ఉందని అంటునారు. టైం లూప్ కాన్సేక్ట్ తో వచ్చిన ఈ సినిమా ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఆసక్తిగా సాగుతూ సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను క్యారీ చేస్తూ…
అదే రేంజ్ లో కిక్ ఇస్తూ రేసీ స్క్రీన్ ప్లే తో మెప్పించి ఓవరాల్ గా ఓ మంచి థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ ని కలిగించింది అని అంటున్నారు. ఓవరాల్ గా టాక్ అక్కడ పాజిటివ్ గా ఉండటంతో కలెక్షన్స్ కూడా కుమ్మేయడం ఖాయం అంటున్నారు. ఇక త్వరలోనే సినిమాను తెలుగు లో కూడా రిలీజ్ చేయబోతున్నారు… డేట్ త్వరలో చెబుతారని సమచారం…