బాహుబలి రాకతో ఒక్క టాలీవుడ్ లోనే కాదు టోటల్ ఇండియా లో ఉన్న అన్ని ఇండస్ట్రీ లలో భారీ బడ్జెట్ మూవీస్ కామన్ అయిపోయాయి. ఇలాంటి టైం లో టాలీవుడ్ లో కూడా సాహో, సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీస్ రాగా సాహో ఫ్లాఫ్ టాక్ తో కూడా భారీ వసూళ్లు సాధించినా ఓవరాల్ గా హిట్ అనిపించుకోలేదు. మరో పక్క సైరా హిట్ టాక్ తో ఫ్లాఫ్ అని పించుకుంది.
ఇలాంటి టైం లో మళ్ళీ రాజమౌళి పెద్ద దిక్కు కానుండగా… వచ్చే ఏడాది ఆర్ ఆర్ ఆర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్స్ కి తోడూ మరో భారీ ప్రాజెక్ట్ కూడా భారీ హైప్ ని సొంతం చేసుకుంది. అదే రామాయణం.
అందరికీ తెలిసిన కథే అయినా ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో 2 పార్టులుగా ఈ కథని తెరకెక్కించాలని అల్లు అరవింద్ అనుకుని ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. కాగా రాముడిగా రామ్ చరణ్ ని అనుకోగా రావణాసురుడి రోల్ కోసం చాలా మంది హీరోలను అనుకోగా జై లవ కుశ సినిమా లో విలనిజంతో ఆకట్టుకున్న…
ఎన్టీఆర్ ని మరోసారి రావణాసురుడిగా అనుకున్నారు. కానీ అటు రామ్ చరణ్ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ ఈ రోల్స్ కి సిద్ధం అని ఒప్పుకోలేదు, దాంతో వేరే ఇండస్ట్రీల స్టార్స్ ని రిప్లేస్ చేద్దాం అనుకున్నా…ఇతర ఇండస్ట్రీలు తెలుగు బిగ్ మూవీస్ సాహో అండ్ సైరా కి దెబ్బ వేయడంతో నమ్మకం సడలిన అల్లు అరవింద్…
ఇప్పుడు ఈ 500 కోట్ల రామాయణం ప్రాజెక్ట్ ని ఆపేశారని టాలీవుడ్ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి. ఇది చాలా వరకు నిజమే అని కూడా అంటున్నారు. దాంతో మహాభారతం ఇప్పటిప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ తీయకున్నా రామాయణాన్ని భారీ ఎత్తున చేస్తారు అనుకున్నా ఆ ఆశకి ప్రస్తుతానికి పులిస్టాప్ పడినట్లు అయింది. మరి ఫ్యూచర్ లో అయినా తిరిగి మొదలు అవుతుందో లేదో చూడాలి.