Home టెక్నాలజీ-డీల్స్ చైనా మొబైల్స్ బ్యాన్ చేయాలా?…చేస్తే ఏమవుతుంది??

చైనా మొబైల్స్ బ్యాన్ చేయాలా?…చేస్తే ఏమవుతుంది??

239
0

        మొబైల్స్ అలాగే ఎలట్రానిక్ వస్తువులు చైనా నుండే ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటారో తెలుసా… చైనాలో లేబర్ కాస్ట్ చాలా తక్కువ. ఇది ఒక రీజన్ కాగా అతి పెద్ద రీజన్ ఏంటి అంటే… ఎందుకని చాలా కంపెనీలు చైనా లోనే మానుఫాక్చర్ చేస్తాయి అనడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది.

1970 లో చైనా ప్రభుత్వం చైనా లో కొన్ని ప్రదేశాలను ఎంచుకుంది, కొన్నింటికి SAR -special adminstrative region..ఇందులో హాంకాగ్ మరియు మకావ్ మరికొన్ని ప్రాంతాలు ఉండగా, మరి కొన్ని ప్రదేశాలను SeZs – special econimal zones పెట్టారు… ఇందులో ఫేమస్ అయింది శెంజిన్ ప్రాంతం…

ఈ ప్రదేశాల ప్రత్యేకత ఏంటి అంటే…ఇవి చైనా లో మొదట్లో వెనక బడిన ప్రదేశాలు… సో వీటిని ముందే గమనించిన ప్రభుత్వం ఇక్కడ ఇతర దేశాల కంపెనీలు వచ్చి తమ మానుఫాక్చర్ ని చేసుకోవచ్చని, మీరు ఇక్కడ వచ్చి మానుఫాక్చర్ చేసుకుంటే…టాక్స్ చాలా తక్కువ పే చేస్తే సరిపోతుందని, మరిన్ని ఆఫర్స్ ని చేసింది.

అందుకే చాలా కంపెనీలు ఈ శెంజిన్ ప్రదేశాన్ని ఎంచుకుని భారీ లెవల్ లో తమ ఫ్యాక్టరీలను ఇక్కడ పెట్టడం మొదలు పెట్టింది, దానికి తోడూ ఇక్కడ లేబర్ రేటు చాలా తక్కువ అవ్వడం తో అందరూ ఇక్కడే ఫ్యాక్టరీలను పెట్టడం మొదలు పెట్టారు. దాంతో అతి తక్కువ సమయం లోనే చైనా వరల్డ్ లోనే బిగ్గెస్ట్ మానుఫాక్చర్ ఫ్యాక్టరీల ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి అడ్డగా మారింది.

ప్రపంచంలో మనం వాడే అనేక ఎలట్రానిక్ పరికరాలు చాలా పెద్ద మొత్తం లో శెంజిన్ ప్రదేశం నుండే వస్తాయి అంటే అక్కడ ఎంత భారీ లెవల్ లో ఈ ప్రొడక్షన్ జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక స్కిల్ లేవర్… అంటే అంటే ఫ్యాక్టరీలలో పని చేసే లేబర్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం లో చైనా ముందు నుండి ఎక్కువ శ్రద్ధ పెట్టింది, దాంతో అక్కడ పని చేయడానికి ఎక్కువ సంఖ్యలో జనాలు అందుబాటులో ఉండటం తో తక్కువ రేట్లకే పని చేసే వారు దొరుకుతున్నారు. దాంతో లేబర్ కాస్ట్ చాలా తక్కువ గా ఉంటుంది.

దాంతో కంపెనీలు ఇక్కడ ఫ్యాక్టరీ లు పెట్టిన తర్వాత ప్రపంచం అంతా చాలా సులువుగా వస్తువులను ఎక్స్ పోర్ట్ చేయడం మొదలు పెట్టారు.

ఇక ఫ్యాక్టరీలలో తయారు చేసే ఎలట్రానిక్ పరికరాలకు రా మెటీరియల్ చాలా వరకు అవసరం  ఉంటూ ఉంటుంది, అవి పక్కన ఉండే ఇతర కంపనీల ఫ్యాక్టరీలలో మానుఫాక్చర్ చేస్తూ ఉండటం తో ఒకరి నుండి ఒకరు భారీ ఆర్డర్స్ ని ఇవ్వడం అవి అక్కడే ఎలట్రానిక్ పరికరాల్లో అమర్చడం జరుగుతుంది.

ఇక అక్కడ కంపనీల ఫ్యాక్టరీ లు అత్యంత భారీ ఆర్డర్స్ వచ్చినప్పుడు అన్నీ కలిసి కట్టుగా ఆర్డర్ ఎంత పెద్దది అయినా అన్నీ మానుఫాక్చర్ చేస్తాయి, అందుకే వరల్డ్ లో బిగ్గెస్ట్ ఎక్స్ పోర్ట్ ప్రదేశంగా చైనా నిలిచింది.

ఇదంతా ఒకెత్తు అయితే… చైనా పాపులేషన్ ఎంత అనేది అందరికీ తెలిసిందే 140 కోట్ల జనాభా కలిగిన చైనా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఏరియా… అలాంటి ఏరియాలో కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టడం తో మేడ్ ఇన్ చైనా టాగ్ తో అక్కడే భారీ మార్కెట్ ని చేసుకోగలవు, అది మరో అడ్వాంటేజ్ అని చెప్పాలి.

ఒక యాపిల్ అమెరికాలో టోటల్ గా మానుఫాక్చర్ అయ్యే రేటు తో చైనా లో 3 నుండి 4 ఫోన్స్ ని మానుఫాక్చర్ చేయవచ్చని అంటుంటారు. అందుకే వరల్డ్ మొత్తం చైనా లోనే మానుఫాక్చర్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఇక ఇండియా లో కూడా మానుఫాక్చర్ మొదలు అయినా మేడ్ ఇండియా టాగ్ కనిపిస్తున్నా కానీ… ఆ మొబైల్స్ లో కానీ…

ఇతర ఎలట్రానిక్ పరికరాల్లో కానీ చాలా కాంపోనెంట్స్ చైనా నుండే తెప్పించుకుంటారు. చైనా 1970 లో ఇతర కంపనీలను ఎక్కువగా ఆహ్వానిస్తే ఇండియా గత కొన్ని ఏళ్లుగా ఈ పని చేస్తుంది, కానీ ఇప్పటికీ మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నామని చెప్పాలి. త్వరలోనే ఇండియా కూడా మానుఫాక్చర్ రంగం లో మరింత దూసుకు వెళ్ళడం అయితే ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here