Home న్యూస్ జాక్ పాట్ కొట్టేసిన శ్యామ్ సింగరాయ్….హిందీలో కెరీర్ బెస్ట్ రేటు!

జాక్ పాట్ కొట్టేసిన శ్యామ్ సింగరాయ్….హిందీలో కెరీర్ బెస్ట్ రేటు!

813
0

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్, ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా ఆల్ మోస్ట్ సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఆడియన్స్ కి ఒక ఐడియా వచ్చేసింది, కమర్షియల్ గా ఎలా ఉంటుంది అన్నది పక్కకు పెడితే జెర్సీ మాదిరిగానే మరో మంచి కంటెంట్ ఉన్న సినిమా గా…

ఈ సినిమా నిలుస్తుందన్న నమ్మకం అయితే అందరిలోనూ ఉందని చెప్పాలి. ఇక సినిమా సౌత్ భాషలు అన్నింటా రిలీజ్ కాబోతుండగా హిందీ లో కూడా రిలీజ్ అవుతుందేమో అని అనుకున్నా కానీ సినిమా హిందీ లో కాకుండా సౌత్ మొత్తం డబ్ అయ్యి రిలీజ్ కానుండగా…

హిందీ లో సినిమా డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ను రీసెంట్ గా అమ్మేశారు…. నార్త్ సైడ్ తెరకెక్కిన మూవీ అవ్వడంతో అద్బుతమైన రేటు ని సినిమా అక్కడ సొంతం చేసుకుని నాని కెరీర్ బెస్ట్ రేటు కి అక్కడ సాధించింది అని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. శ్యామ్ సింగ రాయ్ కి…

హిందీ లో డబ్బింగ్ రైట్స్ కి అక్షరాలా 10 కోట్ల రేటు సొంతం అయ్యింది, ఇది నిజంగానే ఎక్స్ లెంట్ రేటు అని చెప్పాలి. ఇది వరకు చేసిన వి ది మూవీ సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ 8 కోట్ల రేంజ్ రేటు ని సొంతం చేసుకోగా అది కెరీర్ బెస్ట్ రేటుగా ఉండేది కానీ ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ ఆ రేటుని అధిగమించి ఏకంగా 10 కోట్ల రేటు తో…

సంచలనం సృష్టించి దుమ్ము లేపింది… ఇక సినిమా మిగిలిన సాంగ్స్ త్వరలోనే రిలీజ్ కానుండగా ఆడియన్స్ ముందుకు సినిమా డిసెంబర్ 24న రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉంది, పోటి లోనే రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా సినిమా కి మంచి కలెక్షన్స్ దక్కే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here