లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టిల్లు స్క్వేర్ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టి టోటల్ రన్ లో ఏకంగా 130 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie)తో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా…
అనుకున్న రేంజ్ లో హైప్ ను సొంతం చేసుకోలేక పోయింది…ఓపెనింగ్స్ నుండే పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయిన సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని భారీ నష్టాలను కూడా సొంతం చేసుకుంది. ఇక సినిమా రీసెంట్ గా…
బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అవ్వగా…నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సినిమా డిజిటల్ వర్షన్ కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. సినిమా స్టోరీ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కథని బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్న రేంజ్ లో…
తెరకెక్కించలేక పోయాడు అని అంటున్నారు. ఫస్టాఫ్ బాగానే టైం పాస్ అయ్యేలా అనిపించినా సెకెండ్ ఆఫ్ కథ మాత్రం సిల్లీగా సాగి డ్రాగ్ అయిన ఫీలింగ్ కలగగా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా మరీ ఓవర్ ది టాప్ అనిపించేలా సాగిందని, దానికి తోడూ హీరో హీరోయిన్ ల లవ్ ట్రాక్ కూడా…
పెద్దగా ఏమి ఇంప్రెస్ చేయలేక పోయింది అని అంటున్నారు, కానీ సినిమాను చివరి వరకు చూసేలా సిద్ధూ జొన్నలగడ్డ ఎంత కష్టపడాలో అంత కష్టపద్దాడని అంటున్నారు. సెకెండ్ ఆఫ్ ఇంకా బెటర్ గా రాసుకుని ఉంటే సినిమా మినిమమ్ ఎబో యావరేజ్ లెవల్ లో…
అయినా అనిపించి ఉండేదని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ బిలో యావరేజ్ లెవల్ లో అనిపించి ఓవరాల్ గా సినిమా యావరేజ్ లెవల్ లో ఎండ్ అయింది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా టాక్ ఎలా ఉన్నా కూడా డీసెంట్ వ్యూవర్ షిప్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి.