బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 90 లక్షల వరకు షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా మిగిలిన రెండు రోజుల వీకెండ్ మొత్తం మీద మరో 1.1 కోట్ల వరకు షేర్ ని రాబట్టగలిగింది. దాంతో ఓవరాల్ గా మొదటి వీకెండ్ కలెక్షన్స్ 2 కోట్ల మార్క్ ని అందుకున్నాయి.
సినిమాను ఓవరాల్ గా 5 కోట్లకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో 2 కోట్ల వరకు షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 4 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, సింగిల్ స్క్రీన్స్ లో మాస్ ఏరియాలలో సినిమా బాగానే రన్ అవుతుండటంతో సినిమా మంచి వసూళ్లు కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.