బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మాస్ రచ్చ చేయగా సమ్మర్ లో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గానే ట్రెండ్ ను చూపించి ఇప్పుడు శ్రీ విష్ణు కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని…
సొంతం చేసుకున్న సినిమా గా నిలిచి రచ్చ చేసింది…రెండేళ్ళ క్రితం శ్రీ విష్ణు నటించిన సమ్మర్ బ్లాక్ బస్టర్ మూవీ సామజవరగమనా సినిమా తన కెరీర్ లో ఇది వరకు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. టోటల్ రన్ లో ఈ సినిమా…
వరల్డ్ వైడ్ గా 16.95 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 34.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 18 వ రోజున సాధించిన కలెక్షన్స్ తో సింగిల్ మూవీ వరల్డ్ వైడ్ గా సామజవరగమనా సినిమా టోటల్ షేర్ ని…
దాటేసి 17 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి శ్రీ విష్ణు కెరీర్ లో హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. కానీ గ్రాస్ పరంగా మాత్రం సామజవరగమనా సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల ఎక్కువ వసూళ్ళని అందుకోవడం తో…
గ్రాస్ పరంగా ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉండగా…..ప్రస్తుతానికి సింగిల్ మూవీ 32.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా ఫైనల్ రన్ లో మరో 2 కోట్లకు పైగా గ్రాస్ ను కనుక అందుకుంటే గ్రాస్ పరంగా కూడా శ్రీ విష్ణు కెరీర్ లో బెస్ట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఈ మార్క్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.