Home న్యూస్ శ్రీ విష్ణు “సింగిల్” మూవీ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

శ్రీ విష్ణు “సింగిల్” మూవీ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

కామెడీ సినిమాలతో ఆడియన్స్ ను క్రమం తప్పకుండా అలరిస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ అంచనాలతో రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా ప్రమోషన్స్ యమ జోరుగా సాగుతూ ఉండగా..

ఆడియన్స్ లో డీసెంట్ బజ్ ను అయితే సినిమా క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇక సినిమాకి జస్ట్ హిట్ టాక్ కనుక ఆడియన్స్ నుండి వస్తే మంచి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే అవకాశం ఎంతైనా ఉండగా…. రీసెంట్ శ్రీ విష్ణు సినిమాలు బిజినెస్ పరంగా కూడా…

మంచి జోరునే చూపించగా ఈ సినిమా కూడా గీతా ఆర్ట్స్ వాళ్ళు మేజర్ ఏరియాల్లో ఓన్ గానే రిలీజ్ చేస్తున్నా కూడా వాల్యూ బిజినెస్ డీసెంట్ రేటుకే సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. శ్రీ విష్ణు రీసెంట్ మూవీస్ ఓం భీమ్ భుష్ 9.5 కోట్లు, స్వాగ్ మూవీ 7 కోట్ల రేంజ్ లో..

బిజినెస్ ను సొంతం చేసుకోగా సింగిల్ మూవీ వాల్యూ బిజినెస్ రేంజ్ 6.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా….ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 7 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది.

సుమారు గా తెలుగు రాష్ట్రాల్లో 400 లోపు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ  సినిమా వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సమ్మర్ లో మ్యాడ్2 తర్వాత కామెడీ పరంగా పెద్దగా వచ్చిన సినిమాలు లేవు. ఇక ఈ సినిమా క్లిక్ అయితే సమ్మర్ లో మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here