బాక్స్ ఆఫీస్ దగ్గర కామెడీ ఎంటర్ టైనర్స్ తో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీతో ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకు రాగా మంచి ప్రమోషన్స్ ని జరుపుకుని రిలీజ్ అయిన సింగిల్ మూవీ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే…ఏళ్ళు గడుస్తున్నా తన లైఫ్ లోకి అమ్మాయి రాకపోవడంతో ఎలాగైనా సింగిల్ లైఫ్ కి పులిస్టాప్ పెట్టాలని చూస్తున్న హీరో లైఫ్ లోకి ఇద్దరు హీరోయిన్స్ అడుగు పెడతారు…వాళ్ళు లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది ఆ తర్వాత కథ ఏంటి అనేది అసలు కథ…
కథ పాయింట్ చాలా నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ ఆడియన్స్ ను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు… ఫస్టాఫ్ మాత్రం హిలేరియస్ గా వర్కౌట్ అయింది…. సెకెండ్ ఆఫ్ లో కొంచం కథని చెప్పే క్రమంలో కామెడీ డోస్ తగ్గినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా ఫుల్ టైం పాస్ మూవీ అని చెప్పాలి.
శ్రీవిష్ణు మరోసారి తన దైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా…సింగిల్ లైన్ పంచులు కామెడీ సీన్స్ తో మెప్పించాడు. హీరోయిన్స్ ఇద్దరూ పర్వాలేదు అనిపించగా వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది…. పాటలు ఓకే అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ సాలిడ్ గా అనిపించినా…
సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయిన ఫీలింగ్ రొటీన్ గా ఉందన్న ఫీలింగ్ కలిగింది. అయినా కూడా కామెడీతో అవన్నీ మర్చిపోతాం…ఇక డైరెక్టర్ ముందు నుండి కేవలం కామెడీ కోసమే సినిమా కి రావాలి అని చెప్పడంతో ఆ కామెడీ విషయంలో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు…
సెకెండ్ ఆఫ్ ని కూడా ఫస్టాఫ్ రేంజ్ లోనే ఇంకా ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెంచి ఉంటే సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది. అయినా కూడా పెద్దగా అంచనాలు ఏమి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి సింగిల్ మూవీ మంచి టైం పాస్ అవ్వడమే కాకుండా…
మంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో సాలిడ్ గానే మెప్పించే అవకాశం ఉంది. కేవలం కామెడీ పరంగా సినిమాకు ఫుల్ మార్కులు పడతాయి, కథ కూడా కొంచం ఉండి ఉంటే ఇంకా బాగుండేది కానీ ఓవరాల్ గా ఈ సమ్మర్ లో ఆడియన్స్ ను బాగానే అలరించే అవకాశం ఉంది. సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్…