ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ తో ఆడియన్స్ ను అలరిస్తూ దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మళ్ళీ వచ్చేశాడు…. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండే ఆకట్టుకోగా…టీసర్ ట్రైలర్ లు సైతం బాగానే వర్కౌట్ అవ్వడం…
మంచి ప్రమోషన్స్ ను కూడా జరుపుకోవడంతో ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత డీసెంట్ టు గుడ్ రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు…. కథ పాయింట్ ని ఏమి రివీల్ చేయడం లేదు కానీ…
తను ప్రేమించే అమ్మాయి ఒక వైపు…తనని ప్రేమించే అమ్మాయి మరో వైపు…ఇలాంటి పరిస్థితిలో హీరో ఏం చేశాడు ఆ తర్వాత కథ పాయింట్ ఏంటి అనే కాన్సెప్ట్ తో రూపొందిన సింగిల్ సినిమా ఫస్టాఫ్ చాలా వరకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో మెప్పించింది అని చెప్పాలి..
సింగిల్ లైన్ పంచులు, మీమ్ డైలాగ్స్ తో చాలా వరకు ఎంటర్ టైన్ మెంట్ ను మిక్స్ చేస్తూ ఆల్ మోస్ట్ ఫస్టాఫ్ మొత్తం కామెడీతో మెప్పించింది. ఇక సెకెండ్ ఆఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే సినిమా పక్క హిట్ అనిపించే రేంజ్ లో ఆకట్టుకోగా…
సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా కూడా డైరెక్టర్ ఫస్టాఫ్ రేంజ్ లో కామెడీని మిక్స్ చేయలేక పోయాడు. కొంచం కథ కూడా చెప్పే ప్రయత్నంలో కామెడీ డోస్ తగ్గిపోయింది…కానీ తిరిగి అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అయినట్లు అనిపించింది…
కానీ ఓవరాల్ గా ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ ను సెకెండ్ ఆఫ్ పూర్తిగా క్యారీ చేయలేక పోయింది కానీ సెకెండ్ ఆఫ్ కూడా పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుని ఓ డీసెంట్ ఎంటర్ టైనర్ లా సినిమా అనిపించింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఫస్టాఫ్..
ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపిస్తే సెకెండ్ ఆఫ్ మాత్రం యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా పూర్తి అయ్యే టైంకి ఎబో యావరేజ్ కి అటూ ఇటూగా అనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి… ఇక రెగ్యులర్ షోలకు ఇదే రేంజ్ టాక్ కంటిన్యూ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.