డిఫెరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ ని అలరించే హీరోలలో ధనుష్ ఒకరు, తెలుగులో కూడా మంచి పేరుని తెచ్చుకున్నా స్ట్రైట్ మూవీ చేయని ధనుష్ ఇప్పుడు తెలుగు తమిళ్ బైలింగువల్ గా సార్ మూవీ చేశారు, సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఏర్పడగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీగానే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
కథ 98-2000 టైంలో జరుగుతుంది…. సముద్రఖని త్రిపాటి విద్యాసంస్థలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేసే హీరో ప్రభుత్వ విద్యాసంస్థలలో పని చేయడానికి వెళతాడు… ప్రభుత్వ విద్యాసంస్థల ఆదరణ తగ్గించి తన విద్యాసంస్థలను పెంచుకోవాలని చూసే విలన్ తో హీరో పోటి పడ్డాడు… ఎలా అనుకున్నది సాధించాడు అన్నది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్…. పెర్ఫార్మెన్స్ పరంగా ధనుష్ మరోసారి తన సహజ నటనతో మెప్పించగా… హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో కూడా అదరగొట్టేశాడు…
హీరోయిన్ సంయుక్త పర్వాలేదు అనిపించగా సముద్రఖని విలనిజం మెప్పిస్తుంది, సాయి కుమార్, హైపర్ ఆది, తనికెళ్ళ భరణి తమ రోల్స్ లో మెప్పించగా మిగిలిన యాక్టర్స్ కూడా పర్వాలేదు, సంగీతం బాగుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పిస్తుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం స్లోగా ఉన్నా పర్వాలేదు, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ బాగున్నా కానీ…
కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండగా టేక్ ఆఫ్ కి కొంచం ఎక్కువ టైం తీసుకోవడంతో ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ మాత్రం ఎమోషనల్ సీన్స్ తో బాగానే బాలెన్స్ చేశాడు… కానీ సినిమా చూస్తున్న టైంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 మూవీ ఆడియన్స్ కి గుర్తు రావడం ఖాయం, కొంచం ఆ సినిమా స్పూర్తి ఈ సినిమా లో కనిపించింది…. ఓవరాల్ గా కథ ప్రిడిక్టబుల్ గా ఉండటం, ఇలాంటి స్టొరీలను మనం ఆల్ రెడీ చూసి ఉండటంతో… మరీ ఫ్రెష్ ఫీలింగ్ లేదు కానీ…
కథ బ్యాగ్ డ్రాప్ 2000 టైం నాటిది అవ్వడంతో ఆ ఫ్రెష్ నెస్ తో పాటు యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, సాంగ్స్, ధనుష్ వలన ఈజీగా ఒకసారి చూసేలా సినిమా మెప్పిస్తుంది…. మొత్తం మీద ధనుష్ వెంకీ అట్లూరిల కాంబోలో వచ్చిన సార్ మూవీ మరీ అంచనాలను మించిపోక పోయినా కానీ ఉన్నంతలో ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా మెప్పిస్తుంది…. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….