బాక్స్ ఆఫీస్ దగ్గర బింబిసార సినిమాకి పోటిగా రిలీజ్ అయిన సీతా రామం సినిమా కూడా ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, క్లాసిక్ లవ్ స్టొరీ అవ్వడంతో ఏ సెంటర్ ఆడియన్స్ కి బాగా నచ్చుతున్న ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాలలో అంచనాలను అందుకోలేక పోయింది. ఏ సెంటర్స్ లో హోల్డ్ బాగానే ఉన్నప్పటికీ బి సి సెంటర్స్ లో బింబిసార జోరు వలన…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ కూడా అనుకున్న అంచనాలను అందుకోలేక పోయాయి. దాంతో 2 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో వస్తాయి అనుకున్నా కానీ సినిమా 1.50 కోట్ల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది, కానీ టాక్ బాగుండటంతో…
లాంగ్ రన్ లో సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించడంతో ఓవరాల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క డీసెంట్ గా ఉంది కానీ ఈ రేంజ్ టాక్ కి ఇంకొంచం బెటర్ గా కలెక్షన్స్ రావాల్సి ఉండేది అని చెప్పాలి.
మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 54L
👉Ceeded: 16L
👉UA: 23L
👉East: 15L
👉West: 8L
👉Guntur: 16L
👉Krishna: 13L
👉Nellore: 5L
AP-TG Total:- 1.50CR(2.25Cr~ Gross)
Ka+ROI – 15L
Other Languages – 35L
OS – 1.05Cr
Total World Wide – 3.05CR( 5.60CR~ Gross)
మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ 14.20 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం 15 కోట్లు కావాలి, అన్ని వర్షన్స్ కలుపుకుని సినిమా 16.20 కోట్ల బిజినెస్ కి 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఫస్ట్ డే తర్వాత సినిమా ఇంకా 13.95 కోట్ల షేర్ దూరంలో ఉంది అని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.