బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమాల్లో కంప్లీట్ గా క్లాస్ కంటెంట్ తో వస్తున్న సినిమా సీతా రామం. టాక్ బాగుంటే క్లాసిక్ అనిపించుకునే అన్ని అవకాశాలు ఉన్న ఈ సినిమా పై ఏ సెంటర్స్ లో మల్టిప్లెక్స్ ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉండగా సినిమా క్లాస్ అయినా బిజినెస్ మాత్రం మాస్ అనిపించేలా సొంతం చేసుకుంది ఈ సినిమా… కానీ…
ఇప్పుడు లాస్ట్ మినట్ లో సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ కొద్ది వరకు తగ్గాల్సి వచ్చింది. దానికి కారణం తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ టైం కి సరిపడా థియేటర్స్ లో రిలీజ్ దొరక్కపోవడమే అని చెప్పాలి. దాంతో బిజినెస్ లో కొద్దిగా మార్పులు జరిగాయి.
ఒకసారి సినిమా కొత్త బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 4Cr
👉Ceeded – 1.5Cr
👉Andhra – 6Cr
AP TG:- 11.50Cr
👉Ka+ROI – 0.70Cr
👉OS – 2.5Cr
👉Other Languages – 1.50Cr(Valued)
Total WW:- 16.20Cr
ఇది వరకు 18.70 కోట్లు ఉన్న బిజినెస్ ఇప్పుడు 2.50 కోట్లు తగ్గింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.