Home న్యూస్ సీతా రామం రివ్యూ….క్లాసిక్ లవ్ స్టొరీ!

సీతా రామం రివ్యూ….క్లాసిక్ లవ్ స్టొరీ!

0

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల కాంబినేషన్ లో రష్మిక స్పెషల్ రోల్ లో, సుమంత్, స‌చిన్ ఖేడ్క‌ర్‌, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా భారీ స్టార్ కాస్ట్ తో 1960 టైం బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా సీతా రామం… యుద్ధంతో రాసిన కథ అంటూ టాగ్ లైన్ ని హైలెట్ చేస్తూ వచ్చిన ఈ లవ్ స్టొరీ ఆ టాగ్ లైన్ కి తగ్గట్లు మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ….

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…. పాకిస్థాన్ లో ఉండే రష్మికకి తన తాత స‌చిన్ ఖేడ్క‌ర్‌ ఆస్తి కోసం ఒక ఉత్తరం ఇండియాలో హైదరాబాదులో ఉండే సీతా మాలక్ష్మి కి చేరవేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో లెఫ్ట్ నెంట్ రామ్ అయిన దుల్కర్ సల్మాన్ సీతా మృణాల్ ల ప్రేమ కథ గురించి తెలుస్తుంది.

అసలు వీళ్ళ ప్రేమ కథ ఎలా మొదలు అయింది, ప్రేమ కథ సఫలం అయ్యిందా లేదా… ఈ లెటర్ ని గమ్యానికి చేర్చే క్రమంలో రష్మికలో వచ్చిన మార్పు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథగా చెప్పాలి అంటే సింపుల్ కథ నే అయినా కానీ…చెప్పిన విధానం చాలా బాగా మెప్పిస్తుంది సీతా రామంలో…

ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ తన రోల్ కి 100% న్యాయం చేశాడు. తన డైలాగ్స్, యాక్టింగ్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉన్నాయి. ఇక మృణాల్ పాత్ర అలవాటు పడటానికి కొంచం టైం పట్టినా తర్వాత ఆ పాత్ర అద్బుతంగా మెప్పిస్తుంది. లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుంది.

ఇక రష్మిక రోల్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా సుమంత్ రోల్ మెప్పించింది, మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా అందరికీ ఉన్నంతలో కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్స్… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడా స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది…

కథ జరిగే కాలం అలాంటిది కాబట్టి అది కూడా పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా అప్పటి టైంకితగ్గట్లు వేసిన సెట్స్ తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగా మెప్పించాయి… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే హను రాఘవపూడి సెకెండ్ ఆఫ్స్ ని చెడగొడతాడు అన్న అపవాదు ఉంది.

కానీ అది ఈ సినిమాతో చెరిగిపోయింది అని చెప్పాలి. స్లో నరేషన్ ఒక్కటి పక్కకు పెడితే ఫస్టాఫ్ ఎంత బాగా ఇంప్రెస్ చేస్తుందో ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా ఆ అంచనాలను తగ్గట్లు సెకెండ్ ఆఫ్ ని డీల్ చేసిన విధానం, అలాగే క్లైమాక్స్ ని ఎండ్ చేసిన తీరు ఈ సారి ఫుల్ మార్కులు పడేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు…

మొత్తం మీద ఓ క్లాసిక్ లవ్ స్టొరీ చూడాలి అనుకున్న వాళ్ళకి, క్లాస్ అండ్ లవ్ స్టొరీస్ ఇష్టపడే వాళ్ళకి సీతా రామం చాలా బాగా నచ్చుతుంది. రొటీన్ కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి రెగ్యులర్ ఆడియన్స్ కి కొంచం ఓపిక చేసుకుంటే సినిమా ఓ మంచి ఫీల్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here