బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంటే ఆ సినిమా కి పోటిగా క్లాస్ కంటెంట్ తో వస్తున్న దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ సీతా రామం సౌత్ భాషలు అన్నింటిలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది… కాగా కంప్లీట్ క్లాస్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా…
బిజినెస్ పరంగా మాత్రం అందరినీ ఆశ్యర్యపరుస్తూ సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అని చెప్పాలి. సినిమా ఓవరాల్ వర్త్ బిజినెస్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువే జరిగింది… క్లాస్ మూవీ కి ఈ రేంజ్ లో…
బిజినెస్ జరగడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న దాని కన్నా కూడా చాలా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఒకసారి సీతా రామం మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే….
👉Nizam – 5Cr
👉Ceeded – 2Cr
👉Andhra – 7Cr
AP TG:- 14.00Cr
👉Ka+ROI – 0.70Cr
👉OS – 2.5Cr
👉Other Languages – 1.50Cr(Valued)
Total WW:- 18.70Cr
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. సినిమా పై మరీ అద్బుతం కాదు కానీ డీసెంట్ అంచనాలు ఉన్నాయి. అయినా కానీ ఈ రేంజ్ లో….
కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు వెనక్కి రాబడుతుంది అన్నది ఆసక్తి కరం. ఈ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ కాదు ఏకంగా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.