Home న్యూస్ ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డుల హీరో…కొత్త సినిమాకి ఈ బుకింగ్స్ ఏంటి సామి!!

ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డుల హీరో…కొత్త సినిమాకి ఈ బుకింగ్స్ ఏంటి సామి!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరోలు ఎంత పెద్ద హిట్స్ కొట్టినా కూడా ఖాన్ హీరోలు సల్మాన్, షారుఖ్ మరియు అమీర్ ఖాన్ ల సినిమాలకు ఉండే యుఫోరియా, క్రేజ్ వేరే వాళ్ళ సినిమాలకు ఉండటం కష్టమే…ఆ సినిమాలకు అల్టిమేట్ పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తాయి కానీ…

ఖాన్ హీరోల సినిమాలకు ఆడియన్స్ లో మరో లెవల్ లో క్రేజ్ ఉంటుంది, కానీ రీసెంట్ టైంలో సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతూ ఉండగా షారుఖ్ ఖాన్ సాలిడ్ కంబ్యాక్ తో దుమ్ము దులిపెస్తున్నాడు…ఇక వీళ్ళ కన్నా ముందు మంచి సినిమా పడితే…

బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసే అమీర్ ఖాన్ కి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్ లెంట్ నమ్మకం ఉంటుంది. అమీర్ నటించిన గజినీ, 3 ఇడియట్స్, పీకే మరియు దంగల్ లాంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డుల బెండు తీశాయి… కానీ తర్వాత చేసిన తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కానీ…

లాల్ సింగ్ చడ్డా లాంటి సినిమాలు డిసాస్టర్ అవ్వడంతో అమీర్ ఖాన్ మూవీస్ మీద ఆసక్తి తగ్గుతూ రాగా చాలా టైం తీసుకుని అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్(Sitaare Zameen Par Movie) ఈ శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…

ఈ సినిమా బజ్ అసలు అమీర్ ఖాన్ ఇతర సినిమాలతో కంపేర్ చేస్తే మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించే రేంజ్ లో లేకపోవడం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది. ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఎందుకో మునుపటిలా అమీర్ ఖాన్ సినిమా అంటే…

ఎగబడి చూసే పరిస్థితి కనిపించడం లేదు…ఆడియన్స్ టేస్ట్ భారీగా మారిపోయిందేమో అనిపిస్తుంది…ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉండగా మొదటి రోజు యునానిమస్ టాక్ వస్తే తప్ప సినిమా 12-15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం కొంచం కష్టమే అంటున్నారు.

మరి ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ ఈ సినిమా ప్రస్తుతానికి అండర్ డాగ్ గానే బరిలోకి దిగుతూ ఉన్నప్పటికీ సాలిడ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో జోరు చూపించే అవకాశం ఉంది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here