మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మృణాల్ ల కాంబినేషన్ లో రష్మిక స్పెషల్ రోల్ లో కనిపిస్తున్న లేటెస్ట్ మూవీ సీతా రామం ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి క్లాసిక్ మూవీ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా పై పర్వాలేదు అనిపించే రేంజ్ లో బజ్ ఏర్పడింది అని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద మంచి బిజినెస్ ను సొంతం చేసుకున్న తర్వాత…
ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 860 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు మొదలు అయినా కానీ ఆన్ లైన్ బుకింగ్స్ అయితే అనుకున్న రేంజ్ లో అయితే లేవు…..
సినిమా కంటెంట్ దృశ్యా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పాలి. టాక్ పాజిటివ్ గా ఉంటే మల్టిప్లెక్స్ ఆడియన్స్ అండ్ ఏ సెంటర్స్ లో సినిమా బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ని బట్టి చూసుకుంటే తొలిరోజు…
తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సాధ్యం అని చెప్పాలి. ఇక టాక్ బాగుండి షో షో కి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగా జోరు చూపిస్తే సినిమా 2.5 కోట్ల రేంజ్ లో ఆ పైన కలెక్షన్స్ ని అందుకోవచ్చు. పోటి లో ఉన్న బింబిసార ఇంపాక్ట్ కూడా….
కచ్చితంగా సీతా రామం సినిమా మీద ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఇవన్నీ తట్టుకుని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుంది ఆ టాక్ తో ఎలా హోల్డ్ చేసి తొలిరోజు కలెక్షన్స్ పరంగా ఎంతవరకు జోరు చూపించే అవకాశం ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరం అని చెప్పాలి.