బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ బాలీవుడ్ లో తనకి తిరుగు లేదని నిరూపించుకున్న బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్(Amir Khan) తర్వాత టైంలో మాత్రం హిట్స్ కి దూరం అవ్వగా తన మార్కెట్ పై కూడా ఆ ఇంపాక్ట్ క్లియర్ గా కనిపించింది, కానీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సితారే జమీన్ పర్(Sitaare Zameen Par Movie) తో..
వచ్చిన అమీర్ ఖాన్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ మొదటి రోజు అనుకున్న రేంజ్ లో అయితే థియేటర్స్ కి తరలి రాలేదు…టాక్ ఎంత పాజిటివ్ గా ఉన్నా కూడా మొదటి రోజున సినిమా భారీ గా పెరిగిన ప్రజెంట్ బాలీవుడ్ మార్కెట్ లో…
కేవలం 10.70 కోట్ల రేంజ్ లోనే వసూళ్ళని అందుకుని బిలో పార్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. అమీర్ ఖాన్ కెరీర్ లో కూడా ఇవి వన్ ఆఫ్ ది లోవేస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పాలి. కానీ సినిమా కి మొదటి రోజు వచ్చిన సూపర్ పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
రెండో రోజున ఓ రేంజ్ లో హెల్ప్ అవుతూ ఉండగా రెండో రోజున కుబేరని కూడా డామినేట్ చేసే టికెట్ సేల్స్ తో అన్ని చోట్లా ఫెంటాస్టిక్ జోరు ని చూపెడుతున్న సినిమా ఆల్ మోస్ట్ మొదటి రోజు మీద 100% గ్రోత్ ని సొంతం చేసుకుంటూ ఇలాంటి గ్రోత్ ని రెండో రోజు సొంతం చేసుకున్న…
రేర్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ ఇప్పుడు రెండో రోజున ఇండియాలో 18-20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద మునుపటి ఫామ్ ను గుర్తు చేస్తూ రెండో రోజు తన సినిమాలకు…
హిట్ టాక్ వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపెడుతున్న అమీర్ ఖాన్ ఇప్పుడు ఈ సినిమాతో సెన్సేషనల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు అని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా ఏ రేంజ్ లో వసూళ్ళ రచ్చ చేస్తుందో చూడాలి.