ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) ఆడియన్స్ ముందుకు వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా…
సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చింది. సినిమా ఓవరాల్ గా U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుని 2 గంటల 47 నిమిషాల రన్ టైంతో రాబోతూ ఉండగా సినిమా స్టోరీ పాయింట్ ను రివీల్ చేయక పోయినా కూడా…
ఊర్లో ఉండే హీరోకి పెద్ద బ్యాగ్రౌండ్ ఉంటుంది, కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వలన హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని హీరో ఎలా ఎదిరించాడు అన్నది సినిమా కోర్ పాయింట్ అని అంటున్నారు కానీ సినిమాలో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఆకట్టుకునేలా ఉంటాయి అంటున్నారు.
ఓవరాల్ గా స్టోరీ పాయింట్ రెగ్యులర్ బోయపాటి టెంప్లెట్ తోనే ఉన్నప్పటికీ సినిమాలో ఉన్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆడియన్స్ కనెక్ట్ అయితే సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోవచ్చు అంటున్నారు, కానీ ఓవరాల్ స్టోరీ పరంగా సినిమా పరంగా…
స్కంద మూవీ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు… మాస్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి కొద్ది వరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటం, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి స్కంద నచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఓవరాల్ గా సినిమా కి సెన్సార్ వాళ్ళ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ అయితే వినిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ ల తర్వాత కూడా ఇదే ఎక్కువమందికి అనిపించింది అని చెప్పాలి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుందో చూడాలి ఇక…