బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu)ల కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ స్కంద(Skanda) మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపింది…
మిక్సుడ్ టాక్ మూవీస్ లో మీడియం రేంజ్ హీరోలలో సాలిడ్ వసూళ్ళతో సంచలనం సృష్టించింది కానీ ఓవరాల్ గా అయితే హిట్ గీతని మాత్రం అందుకోలేక పోయింది సినిమా… మొత్తం మీద పరుగు కంప్లీట్ అయ్యే టైంకి 59.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా…
తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యి మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా తర్వాత రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది సినిమా… స్టార్ మా ఛానెల్ వాళ్ళు సినిమాను బాగానే ప్రమోట్ చేసి టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ లో….
U+R కలిపి సినిమా కి 8.47 TRP రేటింగ్ ను సొంతం చేసుకోవడం విశేషం. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ దృశ్యా ఈ రేంజ్ రేటింగ్ సాలిడ్ అనే చెప్పొచ్చు… కొన్ని పెద్ద హిట్ మూవీస్ కి సైతం రేటింగ్ లు చాలా తక్కువగానే వస్తూ ఉండగా స్కంద మూవీకి టెలివిజన్ లో ఈ రేంజ్ రేటింగ్ అందుకోవడం విశేషం అనే చెప్పాలి.