బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మాస్ మూవీ స్కంద(Skanda Movie) ముందు ఈ శుక్రవారమే రిలీజ్ అవ్వాల్సింది కానీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి….
ఇప్పుడు సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద ట్రైలర్ రిలీజ్ ముందు వరకు భారీ బజ్ ఉన్నప్పటికీ కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచం బజ్ తగ్గింది… అయినా కూడా బోయపాటి రామ్ ల కాంబోలో వస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో…
వస్తున్న సినిమా అవ్వడంతో ఏమాత్రం టాక్ బాగున్నా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా రిలీజ్ కి అన్నీ పెర్ఫెక్ట్ గా సెట్ చేస్తున్న మేకర్స్ ఓవర్సీస్ లో 350 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ ను ఫైనల్ చేయగా ఇప్పుడు నైజాం లో కూడా బిగ్ రిలీజ్ ను…
ప్లాన్ చేస్తున్నారు. నైజాంలో సినిమాను దిల్ రాజు రిలీజ్ చేయబోతుండగా సినిమా ఇప్పుడు నైజాంలో ఆల్ మోస్ట్ 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. రిలీజ్ రోజున మరో సినిమా చంద్రముఖి2(Chandramukhi2 Movie) సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ…
ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ కి కొంచం అటూ ఇటూగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం. ఇక సినిమా కి మార్నింగ్ షోలకు ఏమాత్రం టాక్ డీసెంట్ గా ఉన్నా కూడా ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసే అవకాశం ఉంది. ఇక టోటల్ థియేటర్స్ అండ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.