బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) మీడియం రేంజ్ మూవీస్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకున్నా కూడా…..
సినిమా కి మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని అంచనాలను అందుకోలేక పోయింది. కాగా సినిమా మీద ఉన్న అంచనాలను అందుకుని ఉంటే సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది కానీ టాక్ మిక్సుడ్ గా ఉండటం కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించింది.
ఇక సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఇందులో జస్ట్ రామ్ ఇంట్రో సీన్ కోసం పెట్టిన ఖర్చు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. భారీ కాన్వాయ్ తో తెరకెక్కిన ఈ సీన్ కోసం మేకర్స్ ఆల్ మోస్ట్ 4.25 కోట్ల రేంజ్ లో ఖర్చు పెట్టి సీన్ ని తీశారట…
సినిమాలో రామ్ ఇంట్రో సీన్ కి ఇంటర్వెల్ కి, అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయింది.. అందులో ఇంట్రో సీన్ కి రెస్పాన్స్ మరో లెవల్ లో సొంతం అవ్వగా ఓవరాల్ గా పెట్టిన ఖర్చు మొత్తం ఆ సీన్ లో బాగానే ఎలివేట్ అయింది అని చెప్పాలి.
కానీ ఒక్క ఇంట్రో సీన్ కోసం ఆల్ మోస్ట్ 4.25 కోట్ల రేంజ్ మమ్మోత్ బడ్జెట్ ను పెట్టడం అందరినీ ఆశ్యర్యపరిచింది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ గీతని దాటాలి అంటే మాత్రం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.