బాలీవుడ్ లో చాలా టైం గా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ రీసెంట్ టైంలో చేసిన సినిమా చేసినట్లు బాక్స్ అఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ అయిన స్కై ఫోర్స్ సినిమాతో…
రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ చేయగా రిలీజ్ కి ముందే సినిమా టికెట్స్ ను ఫ్రీ గా అఫీషియల్ గా బుక్ మై షో లో పంచి పెట్టారు…రెండు టికెట్స్ కొంటె 400 కాష్ బ్యాక్ వస్తుంది అంటూ డిఫెరెంట్ డిఫెరెంట్ ఆఫర్స్ ఇచ్చి జనాలను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేయగా…
అది ఎట్టకేలకు వర్కౌట్ అయ్యి సినిమాను చూడటానికి భారీగానే జనాలు థియేటర్స్ కి వచ్చారు..వీకెండ్ వరకు చాలా వరకు టికెట్స్ ను ఇలానే బుక్ చేయగా తర్వాత ఆఫర్ ను తీసి పక్కకు పెట్టినప్పటికీ బాలీవుడ్ లో సినిమాకి డీసెంట్ టాక్ రావడంతో….ఆదివారం సినిమాకి మంచి కలెక్షన్స్ సొంతం అయ్యాయి…
ఓవరాల్ గా ఫ్రీ టికెట్ సేల్స్ పంచిపెట్టిన తర్వాత మొత్తం మీద మొదటి రోజున 15.30 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా రెండో రోజు 26.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు సండే అండ్ రిపబ్లిక్ డే ఆఫర్స్ తో 31.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…
ఓవరాల్ గా వీకెండ్ లో సినిమాకి హిందీలో 73.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి…కానీ ఈ కలెక్షన్స్ లో సగం వరకు ఫ్రీ టికెట్స్ ని పంచి పెట్టి కలెక్షన్స్ ని రిపోర్ట్ చేశారు అంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు….జనాలను థియేటర్స్ కి రప్పించడం కోసం…
మంచి కంటెంట్ ని నమ్ముకోవాల్సిన చోట ఇలా ఫ్రీ టికెట్స్ ను…బల్క్ బుకింగ్స్/కార్పోరేట్ బుకింగ్స్ చేసి కలెక్షన్స్ ని వచ్చిన మొత్తం లో కలిపి మా సినిమా హిట్ మా సినిమా హిట్ అనిపించుకుంటున్నారు బాలీవుడ్ లో….ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.