బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఒక మంచి సినిమా వచ్చింది…కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా మీద మంచి అంచనాలే ఉండగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకి…
ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ముందు రోజు వరకు అంతంత మాత్రమే ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది కానీ కుబేర బుకింగ్స్ జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లోనే…
ఉంటూ రాగా అంత మంచి కాస్ట్ తో మంచి ప్రామిసింగ్ మూవీలా అనిపిస్తున్న సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుందో అన్న డౌట్స్ నెలకొనగా ఒక్కసారిగా సినిమాకి ప్రీమియర్స్ తర్వాత ఆడియన్స్ నుండి వచ్చిన యునానిమస్ టాక్ ఇంపాక్ట్…
ఓవర్సీస్ షో లలో క్లియర్ గా కనిపిస్తూ ఉండగా ముందు ఓపెనింగ్స్ పై డౌట్ ఉన్నా ఇప్పుడు ఏకంగా సినిమా అంచనాలను మించి పోయి ప్రీమియర్స్ కి ఆల్ మోస్ట్ హాల్ఫ్ మిలియన్ డాలర్ రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని శేఖర్ కమ్ముల బ్రాండ్ వాల్యూ…
ఇంకా తగ్గలేదని నిరూపించింది…సినిమాకి కూడా ఎక్స్ లెంట్ పాజిటివ్ టాక్ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా ఓవర్సీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుని ఈ ఇయర్ అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో ముందు నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక ఇండియాలో కూడా సినిమాకి పాజిటివ్ టాక్ భారీగా హెల్ప్ కాబోతుంది. వీకెండ్ లో కచ్చితంగా కుబేర సినిమా అన్ని చోట్ల కలెక్షన్ల వీర విహారం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది… చాలా టైం తర్వాత బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్ళతో కళకళలాడబోతుంది ఇప్పుడు…