కొత్త సినిమా లు థియేటర్స్ లో ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా అయితే కనిపించడం లేదు… పరిస్థితులు ఏడాది చివరి వరకు కూడా సెట్ అయ్యే అవకాశం కూడా తక్కువ గానే ఉందని పిస్తుంది. ఇలాంటి టైం లో సమ్మర్ రేసు లో నిలిచిన అనేక సినిమా లు కూడా తమ రేంజ్ ని బట్టి వెయిట్ చేయగల అంత పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ ఉంటే ఆగుతున్నాయి, ఫైనాన్స్ ఇబ్బందులు లాంటివి ఉంటే…
బెటర్ ఆఫర్ వస్తే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాయి…. హిందీ సినిమా లు ఎక్కువగా ఇలా డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధపడగా తెలుగు లో కొన్ని చిన్న సినిమాలు ఇలా డైరెక్ట్ రిలీజ్ చేశాయి. ఇక ఆగిపోయిన సినిమాల్లో చిన్న సినిమా అయిన యాంకర్ ప్రదీప్ హీరోగా లాంచ్ అవుతున్న…
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కూడా ఉంది… నీలి నీలి ఆకాశం అనే ఒక్క పాట మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ సినిమా చిన్న సినిమానే అన్నారు కానీ డిలే అవ్వడం అండ్ స్టార్ కాస్ట్ కూడా బాగానే ఉండటం తో ఏకంగా 4.5 కోట్ల రేంజ్ ఖర్చు అయింది.
అందులో అప్పులు, వాటి వడ్డీలు కూడా ఉన్నాయట…. ఇక ఈ సినిమా మార్చ్ ఎండ్ లోనే రావాల్సి ఉన్నా కానీ పరిస్థితుల దృశ్యా రిలీజ్ ఆగిపోగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ ఇప్పటి వరకు ఈ సినిమాకి దక్కలేదట కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా కి మంచి OTT ఆఫర్ వచ్చిందనే టాక్ ట్రేడ్ లో వినిపిస్తుంది.
4.5 కోట్ల రేంజ్ ఓవరాల్ ఖర్చు అయిన ఈ సినిమాకి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి 6.5 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ దక్కిందని సమాచారం… సినిమాకి బిజినెస్ జరిగినా కూడా ఇంత జరిగే అవకాశమే లేదు అని చెప్పాలి. కానీ టీం ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. త్వరలోనే సినిమా పై అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు…