మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నభా నటేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారలను పూర్తీ చేసుకుంది. సినిమా మొదటి వారంలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా. రెండో వీకెండ్ న్యూ ఇయర్ హాలిడేస్ రావడం తో మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిన సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం…
వర్కింగ్ డేస్ లో మాత్రం భారీగా స్లో అయ్యి పరుగును ముగించడానికి సిద్ధం అయ్యింది, మరో పక్క రెండో వారంలో సినిమా డిజిటల్ రిలీజ్ కూడా అవ్వడంతో అది థియేటర్స్ లో కలెక్షన్స్ ని సాధించడానికి ఎఫెక్ట్ చూపింది. మొత్తం మీద సినిమా 11 వ రోజు…
21 లక్షల షేర్ ని, 12 వ రోజు 12 లక్షల షేర్ ని, 13 వ రోజు 9 లక్షల షేర్ ని, ఇక 14 వ రోజు 7 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ కూడా స్లో అవ్వగా మొత్తం మీద 2 వారాల్లో మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.
టోటల్ గా 2 వారాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 4.23Cr
👉Ceeded: 2.08Cr
👉UA: 1.56Cr
👉East: 94L
👉West: 59L
👉Guntur: 96L
👉Krishna: 68L
👉Nellore: 52L
AP-TG Total:- 11.56CR(19.33Cr+ Gross)
KA+ROI: 55L
Os: 38L
Total WW: 12.49Cr(21.04Cr~ Gross)
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలలో సాధించిన ఏరియాల వారి షేర్లు… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను సాలిడ్ గా అధిగమించి దుమ్ము లేపింది.
సినిమాను మొత్తం మీద 9.2 కోట్లకు అమ్మగా 9.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి 12.49 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని టోటల్ గా 2.89 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సంక్రాంతి సినిమాల రాకతో పరుగును పూర్తీ చేసుకునే అవకాశం ఉంది.