Home న్యూస్ సన్ ఆఫ్ ఇండియా రివ్యూ…..ఏంటి సామి ఇది!!

సన్ ఆఫ్ ఇండియా రివ్యూ…..ఏంటి సామి ఇది!!

0

సీనియర్ యాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఇప్పుడు 350 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మరి సోలో హీరోగా మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా చాలా గొప్పగా ఉంటుంది అంటూ మేకర్స్ చెప్పిన మాటలను నిలబెట్టిందా లేదా తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను మోహన్ బాబు కిడ్నాప్ చేస్తాడు…. ఈ మిస్టరీని కనిపెట్టడానికి NIA ఆఫీసర్ అయిన ప్రజ్ఞా జైస్వాల్ రంగం లోకి దిగుతుంది, అసలు ఈ కిడ్నాప్స్ ని మోహన్ బాబు ఎందుకు చేశారు… దాని వెనక రీజన్ ఏంటి లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

కథ పాయింట్ కొంచం కొత్తగానే ఉన్నప్పటికీ కూడా ఏ దశలో కూడా సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఫస్ట్ ఫ్రేమ్ నుండే సినిమా గాడి తప్పగా ఏ స్టేజ్ లో కూడా మళ్ళీ ట్రాక్ ఎక్కినట్లు అనిపించలేదు… ఎలాగోలా ఫస్టాఫ్ త్వరగా ముగియడంతో సెకెండ్ ఆఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే సెకెండ్ మరింత విసుగు తెప్పిస్తుంది…

ఉన్నంతలో మోహన్ బాబు తన రీసెంట్ మూవీస్ కన్నా బెటర్ గా కనిపించారు, యాక్టింగ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి, ఇతర స్టార్ కాస్ట్ వాయిస్ ఓవర్ తప్ప చివర్లో తప్పితే ఎక్కడా కనిపించరు… దాంతో ఇది మోహన్ బాబు వన్ మ్యాన్ షో అయింది కానీ అది వెండితెరపై ఆకట్టుకునేలా తీయలేక పోయాడు డైరెక్టర్, రన్ టైం తక్కువ ఉండటం ఒక్కటి సినిమా ప్లస్ పాయింట్ … సంగీతం పర్వాలేదు అనిపించగా….

స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ డైరెక్షన్ ఇలా… అన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి అని చెప్పాలి. ఏ దశలో కూడా సినిమా ఆకట్టుకునేలా అనిపించలేదు… మొత్తం మీద ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ అతి కష్టం మీద ఓపిక చేసుకుని చూడాలని ఫిక్స్ అయినా సినిమా అయ్యే వరకు తట్టుకోవడం కష్టమే…. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 1.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here