బాక్స్ ఆఫీస్ దగ్గర సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది, సినిమా ని మంచు విష్ణు ఉన్నంతలో డీసెంట్ బడ్జెట్ లో క్వాలిటీగానే నిర్మించారని సమాచారం. సినిమాలో ఒక్క పాట కోసమే కోటి 80 లక్షల రేంజ్ లో ఖర్చు చేశామని స్వయంగా మోహన్ బాబు గానే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు…. అలాంటి సినిమా….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలోకి ఒకే ఒక్క నోటబుల్ మూవీగా నిలవగా ఆ అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా సినిమా కి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి కంప్లీట్ గా….
నెగటివ్ టాక్ రావడం, సోషల్ మీడియాలో సినిమా పై విపరీతంగా ట్రోల్స్ లాంటివి జరగడం తో సినిమా ఇక ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. మొత్తం మీద 265 థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా….
మొత్తం మీద మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర కృష్ణా ఏరియాలో అఫీషియల్ గా 64 వేల షేర్ ని సొంతం చేసుకోగా మిగిలిన చోట్లా చాలా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 17 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా మొదటి వారంలో సొంతం చేసుకోగా అందులో షేర్ 9 లక్షల దాకా ఉండే అవకాశం ఉందని….
ట్రేడ్ వర్గాల సమాచారం, ఇక సినిమా కి నెగటివ్ షేర్స్, డెఫిసిట్ లు తీసేస్తే ఇక మిగిలేది ఏమి ఉండదు అనే చెప్పాలి… ఇక రెండో వారంలో భీమ్లా నాయక్ థియేటర్స్ లో ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ అన్నీ కూడా ఆ సినిమా కి ఇచ్చేశారు, వీకెండ్ తర్వాత కొన్ని థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ కానున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో ఇంకొంచం కలెక్షన్స్ ఏమైనా యాడ్ అవుతాయో చూడాలి ఇక.