బాక్స్ ఆఫీస్ దగ్గర సౌత్ నుండి హిందీ లో డబ్ అయ్యి రిలీజ్ అయిన సినిమాల లెక్క ఈ మధ్య భారీగా పెరిగి పోయాయి…కానీ హిందీ లో సౌత్ నుండి వచ్చిన మూవీస్ లో అంచనాలను అందుకున్న సినిమాలు తక్కువే ఉండగా…. 2017 టైంలో బాహుబలి2 సృష్టించిన రికార్డులు టార్గెట్ గా పెట్టుకున్న అనేక సినిమాలు ఏవి కూడా…
ఈ టార్గెట్ ను అందుకోలేక పోయాయి….కానీ ఎట్టకేలకు 2024 ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప2 మూవీ ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బాహుబలి2 కలెక్షన్స్ ని బీట్ చేయడమే కాదు…
ఏకంగా బాహుబలి2 మూవీ మీద ఏకంగా 320 కోట్ల రేంజ్ లో లీడ్ ను చూపించి మాస్ సంచలనం సృష్టించింది…. ఓవరాల్ గా పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు బాలీవుడ్ న్యూ మూవీస్ కూడా అందుకోవడం కష్టమే అని చెప్పాలి..
ఆ రేంజ్ లో ఈ సినిమా ఊచకోత కోయగా….ఓవరాల్ గా సౌత్ నుండి డబ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
South Top 10 Hindi Dub/Direct Net Collections
1. #Pushpa2TheRule- 830.10CR💥💥💥💥
2. #Baahubali2- 511Cr~
3. #KGF2– 435.2Cr
4. #Kalki2898AD – 294.50CR
5. #RRRMovie– 276.8Cr
6. #2Point0: 189Cr
7. #Salaar 1: 153.45CR
8. #Saaho: 150.6Cr
9. #AdiPurush – 143.25CR
10. #Baahubali- 115Cr
11. #Pushpa–108.61Cr
11 వ ప్లేస్ లో ఉన్న పుష్ప1 సినిమా మీద ఇప్పుడు పుష్ప2 మూవీ ఊహకందని గ్రోత్ ని చూపించింది. మొత్తం మీద బాహుబలి2 ఎపిక్ రికార్డ్ బ్రేక్ అయ్యి పుష్ప2 మమ్మోత్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. మరి ఫ్యూచర్ లో ఏ సినిమా పుష్ప2 నెలకొల్పిన ఈ మమ్మోత్ రికార్డ్ ను టచ్ చేసే ప్రయత్నం అయినా చేస్తుందో లేదో చూడాలి.