టాలీవుడ్ మొదలు పెట్టిన రీ రిలీజ్ ల ట్రెండ్ రెండేళ్ళుగా ఇండియాని ఊపెయగా బాలీవుడ్ అండ్ కోలివుడ్ తరుపున రిలీజ్ అయిన కొన్ని సినిమాలు సాలిడ్ రికార్డులను నమోదు చేశాయి. సౌత్ వరకే చూసుకుంటే లాంగ్ రన్ లో డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని టాలీవుడ్ సినిమాలు ఇంకా అందుకోవాల్సి ఉండగా కోలివుడ్ నుండి టాప్ స్టార్ అయిన దళపతి విజయ్ నటించిన 2 సినిమాలు..
ఈ రికార్డ్ ను అందుకోగా గిల్లి సినిమా అయితే ఏకంగా 30 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ తో సంచలనం సృష్టించింది. ఇక సౌత్ రీ రిలీజ్ మూవీస్ లో మొదటి రోజు రికార్డ్ కూడా విజయ్ గిల్లి సినిమా పేరిటే ఉంది… తర్వాత ప్లేస్ లో టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా నిలవగా…
లేటెస్ట్ గా మహేష్ బాబు నటించిన డిసాస్టర్ మూవీ ఖలేజా రీ రిలీజ్ లో మొదటి రోజు సౌత్ ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…అలాగే టాప్ రీ రిలీజ్ మూవీస్ లో టాప్ 5 లో మహేష్ బాబు వి మూడు సినిమాలు నిలవడం మాస్ భీభత్సం అనే చెప్పాలి.
ఒకసారి సౌత్ రీ రిలీజ్ మూవీస్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
South Re Release Movies Top Day 1 Collections World Wide
👉#Ghilli4K – 7.92CR
👉#GabbarSingh4K – 7.53CR
👉#Khaleja4K – 6.85CR******
👉#Murari4K – 5.41Cr~
👉#BusinessMan4K – 5.27Cr
👉#Kushi – 4.15CR~
👉#Simhadri4K – 4.01CR
👉#Arya2 Re Release(2025) – 3.83CR~
👉#Jalsa – 3.20Cr
👉#Salaar Re Release(2025) – 3.18CR
👉#Indra4K – 3.05CR
👉#Sachien – 3.02CR
👉#SVSC Re Release – 2.90CR
ఓవరాల్ గా మహేష్ బాబు నటించిన ఖలేజా, మురారి మరియు బిజినెస్ మాన్ సినిమాలు టాప్ 5 లో చోటు దక్కించుకుని మహేష్ డామినేషన్ ని చూపించగా ఈ ఇయర్ లో వచ్చే అతడు సినిమాతో మరిన్ని సాలిడ్ రికార్డులను మహేష్ అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు మరోసారి..