బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా మొదటి వీకెండ్ లో టాలీవుడ్ తరుపున అనేక రికార్డులను సృష్టించింది…. ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని టాలీవుడ్ రీ రిలీజ్ లలో సొంతం చేసుకున్న ఈ సినిమా…
అలానే టాలీవుడ్ తరుపున ఫస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది…అసలు రీ రిలీజ్ ల ట్రెండ్ నే మొదలు పెట్టిన టాలీవుడ్ ఒక దశలో సాలిడ్ రికార్డులతో దుమ్ము లేపగా కోలివుడ్ లో టాప్ స్టార్..
విజయ్ నటించిన గిల్లి సినిమా రీ రిలీజ్ లో ఆల్ టైం హిస్టారికల్ రికార్డులు క్రియేట్ చేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా రెండో ప్లేస్ లో కూడా విజయ్ నటించిన సచిన్ సినిమా నే నిలిచింది. ఇప్పుడు మూడో ప్లేస్ లో మహేష్ ఖలేజా చోటు దక్కించుకుంది.
ఒకసారి సౌత్ ఆల్ టైం టాప్ రీ రిలీజ్ మూవీస్ ని గమనిస్తే…
South Re Release Movies Top Total Collections Report
👉#Ghilli4K – 32.50CR~
👉#Sachien – 13.60CR
👉#Khaleja4K – 10.35CR~******(4 Days)
👉#Murari4K – 8.90Cr
👉#GabbarSingh4K – 8.01CR~
👉#Kushi – 7.46CR~
👉#Arya2 Re Release(2025) – 6.75CR
👉#SVSC Re Release – 6.60CR
👉#BusinessMan4K – 5.85Cr~
👉#Devadoothan(Malayalam) – 5.3CR+
👉#Spadikam(Malayalam) – 4.90CR~
👉#Orange4K– 4.71Cr(2nd Re Release – 1.35CR)
మొత్తం మీద టాలీవుడ్ తరుపున ఫస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అందుకుని మహేష్ ఖలేజా సంచలనం సృష్టించగా లాంగ్ రన్ లో సచిన్ ని అందుకునే అవకాశం తక్కువే అయినా కూడా అప్ కమింగ్ టాలీవుడ్ రీ రిలీజ్ లకు సాలిడ్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది.