లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తికేయ2(Karthikeya2) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న హీరో నిఖిల్ ఆ సినిమా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఉండగా ఇప్పుడు నిఖిల్(Nikhil) నటించిన కొత్త సినిమా స్పై(Spy Movie) ఆడియన్స్ ముందుకు…
ఈ నెల 29న రిలీజ్ కానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రిలీజ్ కి 3 వారాల టైం కూడా లేదు ఎలాంటి ప్రమోషన్స్ ని జరపలేదు. ఇలాంటి టైంలో సినిమా పోస్ట్ పోన్ అంటూ వార్తలు రాగా హీరో కూడా తన సైడ్ నుండి మీడియా వర్గాలకు సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్…
పెండింగ్ లో ఉందని, అది పూర్తీ అవ్వడానికి టైం పడుతుందని చెబుతూ సినిమా పోస్ట్ పోన్ అయినట్లే అని హింట్ ఇచ్చాడట, కానీ దీనికి పూర్తీ విరుద్దంగా హీరో ఇన్వాల్వ్ మెంట్ కూడా లేకుండానే సినిమా ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా… ఇప్పుడు హీరో ఆన్ లొకేషన్ లో చెప్పిన…
డబ్బింగ్ నే ఎడిట్ చేసి సినిమా ఎడిటింగ్ వర్క్ ని కంప్లీట్ చేసి ఈ నెల చివర్లోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మేకర్స్ కి ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే బడ్జెట్ రికవరీ అవ్వగా మరింత బడ్జెట్ పెట్టి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేయాలి అన్న ఆలోచనలో హీరో ఉండగా…
దీనికి నిర్మాత సమ్మతంగా లేరని ఇన్ సైడ్ వర్గాల టాక్… ఆ విషయంలోనే హీరోకి నిర్మాతకి కొంచం వాగ్వాదం జరిగిందని, నిర్మాత మాత్రం సినిమాను పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేక అదే డేట్ కి ఎలాగైనా రిలీజ్ చేయాలనీ సన్నహాలు చేస్తున్నారని, హీరో చేసేదేమీ లేక సినిమాను ఇక పట్టించుకోవడం లేదని సమాచారం.
సినిమా కి మంచి బజ్ ఉంది, టీం సినిమాను బాగా ప్రమోట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ టాక్ వచ్చినా కూడా కార్తికేయ2 రేంజ్ లోనే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇంటర్నల్ క్లాషెస్ వలన సినిమా ఇప్పుడు ఇబ్బందుల్లో పడబోతుంది. మరి ఫైనల్ గా ఏమవుతుందో త్వరలో తేలనుంది.