హాట్రిక్ విజయాల తర్వాత యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ స్పై (SPY Movie) వరల్డ్ వైడ్ గా 17.50 కోట్ల వాల్యూ బిజినెస్ ని అందుకుని 1600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ను పూర్తీ చేసుకుంది సినిమా…
అక్కడ నుండి సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా సినిమాకి ప్రీమియర్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి. కథ పాయింట్ ని టోటల్ గా రివీల్ చేయకపోయినా కూడా ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని చంపేశాం అనుకుంటూ ఉండగా ఆ క్రిమినల్ బ్రతికే ఉండటం,
ఆ క్రిమినల్ కి సుభాష్ చంద్రబోస్ ఫైల్స్ కి ఒక లింక్ ఉండటం… ఆ కేసుని డీల్ చేయడానికి హీరో సిద్ధం అయిన తర్వాత ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన స్పై మూవీ ఫస్టాఫ్ కథ ఆసక్తిగా స్టార్ట్ అయ్యి మధ్యలో కొంచం స్లో అయినా కూడా తిరిగి ప్రీ ఇంటర్వెల్ నుండి…
ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే అదిరిపోయిందని, సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంచం పడుతూ లేస్తూ సాగినా ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ జోరు అందుకున్న సినిమా పర్వాలేదు బాగుంది అనిపించేలా ముగుస్తుందని అంటున్నారు.
రీసెంట్ టైంలో వచ్చిన ఇలాంటి రా, ఏజెంట్ లాంటి జానర్ మూవీస్ లో డీసెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన సినిమా అని అంటున్నారు. కొన్ని ఫ్లాస్, అలాగే స్లో మూమెంట్స్ ఉన్నప్పటికీ ఈజీగా ఒకసారి చూసేలా సినిమా ఉందని అంటున్నారు.
మొత్తం మీద ఓవర్సీస్ ప్రీమియర్స్ ను పూర్తీ చేసుకున్న తర్వాత స్పై మూవీ ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ వస్తుందని చెప్పాలి. రెగ్యులర్ షోలకు కూడా సినిమా ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంటే సినిమా కచ్చితంగా జోరు చూపించే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ షోలకు సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇక…