యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddarth) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) ఆడియన్స్ ముందుకు జూన్ 29న రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. కార్తికేయ(Karthikeya2) సినిమా తర్వాత నిఖిల్ చేస్తున్న ఈ సినిమా మీద మంచి హైప్ నెలకొంది. కానీ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కానీ…
పెండింగ్ వర్క్ కొంచం ఉండటం, ప్రమోషన్స్ కి పెద్దగా టైం లేక పోవడంతో హీరో సినిమాను పోస్ట్ పోన్ చేసి మంచి ప్రమోషన్స్ జరిపి రిలీజ్ చేయాలని అనుకున్నా నిర్మాతతో అనుకున్న విధంగా చర్చలు జరగకపోవడంతో హీరో తన వైపు నుండి సినిమా పోస్ట్ పోన్ అంటూ…
చెబుతున్నా నిర్మాత మాత్రం సినిమా ప్రమోషన్స్ పనులను కూడా మొదలు పెట్టేశారు… దాంతో ఇప్పుడు ఈ సినిమా పై టాలీవుడ్ లో చర్చలు జరుగుతూ ఉండగా నిఖిల్ తన వరకు ప్రతీ సినిమా జనాల్లోకి బాగా రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ జరిపి తర్వాత రిలీజ్ చేయాలనీ అనుకుంటాడు…
కానీ ఇక్కడ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను ముందే భారీ రేటుకి అమ్మడంతో ఇప్పుడు సినిమా రిలీజ్ లేట్ అయితే నష్టాలు వచ్చే అవకాశం ఉండటంతో నిర్మాత ఎలాగైనా సినిమాను అదే డేట్ కి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ టాక్ అని చెప్పాలి…
ఆ కారణం వలెనే సినిమా రిలీజ్ డేట్ మిస్ అయితే OTT రిలీజ్ చాలా త్వరగా చేయాల్సి వస్తుందని, అది బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉండటం వలెనే జూన్ 29న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. దాంతో OTT వాళ్ళతో కూడా చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే సినిమా రిలీజ్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.