Home న్యూస్ స్పై మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

స్పై మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ స్పై (SPY Movie) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయింది. సినిమా ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వడంతో ఆడియన్స్ లో సినిమా మీద అంచనాలు అయితే ఓ మోస్తరుగా పెరిగాయి. మరి ఇప్పుడు సినిమా ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే రా ఏజెంట్ అయిన హీరో తన అన్నని చంపిన వాళ్ళని అలాగే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకోవాల్సిన భాద్యతని తీసుకోగా ఈ క్రమంలో హీరోకి తెలిసిన నిజాలు ఏంటి… ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా ఓవరాల్ స్టొరీ పాయింట్…

సినిమా ఓవరాల్ స్టొరీ పాయింట్ బాగున్నప్పటికీ నేతాజీ గురించిన సన్నివేశాలు, రానా సీన్స్ అన్నీ కూడా బాగానే వర్కౌట్ అయినప్పటికీ కూడా సినిమా ఓవరాల్ స్క్రీన్ ప్లే మాత్రం అంత టైట్ గా లేదు… సినిమా స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా కూడా తర్వాత కథ స్లో డౌన్ అయిపొయింది…

మళ్ళీ ఇంటర్వెల్ ఈజీగా గెస్ చేసేలానే ఉన్నా కూడా పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ కథలో నేతాజీకి సంభందించిన సీన్స్ మెప్పించినా మిగిలిన కథ చాలా ఫ్లాట్ గా ఉంటుంది… నిఖిల్ మరోసారి తన నటనతో మెప్పించగా హీరోయిన్ పర్వాలేదు అనిపిస్తుంది. మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపిస్తారు…

పాటలు యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగున్నా ఓవరాల్ గా అయితే అంత ఎఫెక్టివ్ గా లేదు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపించగా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది… మొత్తం మీద స్పై మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా…

డైరెక్టర్ అనుకున్న విధంగా అయితే సినిమాను తీయలేక పోయాడు. కానీ పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపించేలా ఉన్న సినిమాలో నేతాజీ సీన్స్ అండ్ డైలాగ్స్ బాగుండటం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దాంతో పాటు మెయిన్ స్టొరీ కాన్సెప్ట్ బాగుండటం నిఖిల్ పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. 

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉండటం, బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా ఉండటం, ఎడిటింగ్ వీక్ గా ఉండటం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్… అయినా కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి సినిమా కొంచం ఓపికతో చూస్తె పర్వాలేదు అనిపించే అవకాశం ఉంది. 

నిఖిల్ నుండి రీసెంట్ టైంలో వచ్చిన సినిమాలతో పోల్చితే కొద్ది వరకు ఆ ట్రాక్ లోనే వెళ్ళినా కానీ పూర్తీ అయ్యే టైంకి ఆ సినిమాల కన్నా కొంచం వెనకబడిపోయింది అనిపించింది. ముందే చెప్పినట్లు కొంచం ఓపికతో చూస్తె పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా సినిమా ఉంటుంది. సినిమా మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here