Home న్యూస్ స్పై ఫస్ట్ టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఇదే!

స్పై ఫస్ట్ టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఇదే!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నిఖిల్(Nikhil) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) ఆడియన్స్ ముందుకు గురువారం భారీ లెవల్ లో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా కార్తికేయ2(Karthikeya2) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో స్పై మూవీ మీద…

భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా పూర్తీ చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది. సినిమా టోటల్ గా U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా 2 గంటల 15 నిమిషాల రన్ టైం తో తెరకెక్కింది…

ఇక సినిమా స్టొరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ చరిత్రలో కనుమరుగు అయిన సుభాష్ చంద్రబోస్ గురించిన కొన్ని కీలక నిజాలు శత్రువుల చేతిలో పడటంతో, హీరో ఏం చేశాడు అన్నది సినిమా స్టొరీ పాయింట్ అని అంటున్నారు… కథ స్టార్ట్ అవ్వడం మంచి ఆసక్తిగా స్టార్ట్ అవుతుందని…

తర్వాత కథ కొంచం స్లో అయినట్లు అనిపించినా తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్లేతో కథ సాగుతుందని. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. ఇక సెకెండ్ ఆఫ్ కథ అక్కడక్కడా కొంచం స్లో అయినా కూడా…

ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ జోరు అందుకుని ఎండ్ బాగుంది అనిపించేలా ముగుస్తుందని అంటున్నారు. ఓవరాల్ గా సీరియస్ స్టొరీనే అయినా కూడా క్వాలిటీ పరంగా ఎక్స్ లెంట్ గా ఉండటం విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉందని అంటున్నారు…. ఓవరాల్ గా స్టొరీ పరంగా రీసెంట్ టైం ఆకట్టుకున్న కథల్లో…

స్పై మూవీ ఒకటని అంటున్నారు, ఇక ఇలాంటి జానర్ లో రీసెంట్ టైంలో మెప్పించిన కథల్లో స్పై మూవీ ఒకటని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాకి సెన్సార్ వాళ్ళ నుండి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇక సినిమా ఆడియన్స్ నుండి ఇదే రేంజ్ లో టాక్ వస్తే మరోసారి నిఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు.

1 COMMENT

  1. Enti babai chinna heros ni thokkeyyadam average to above average cheppinaa konchem nijam undali anni scenes baagunnappudu average enti block buster avuthundi kani thu nee bathuku ala ayithe sensor nundi utter flop result vachindi Mari puspha ki daani gurinchi rayadam ledhe edhaina nojaalu raayandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here