Home న్యూస్ జాక్ పాట్ కొట్టిన చిన్న సినిమా…లాక్ డౌన్ లో టోటల్ బిజినెస్ ఔట్…మెంటల్ మాస్ ఇది!

జాక్ పాట్ కొట్టిన చిన్న సినిమా…లాక్ డౌన్ లో టోటల్ బిజినెస్ ఔట్…మెంటల్ మాస్ ఇది!

4115
0

ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కొన్ని సినిమాలు అద్బుతాలు సృష్టించాయి, వాటి తో పాటే ఇప్పుడు మరో సినిమా కూడా మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని అంతా భావిస్తున్నారు, ఆ చిన్న సినిమానే SR కళ్యాణ మండపం సినిమా. సాంగ్స్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత టీసర్ ట్రైలర్ లు కూడా టాలీవుడ్ లో ఒక మీడియం రేంజ్ మూవీస్…

లెవల్ లో రచ్చ చేయడం విశేషం. ఆ రేంజ్ లో రచ్చ చేయడం వలనే సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా రైట్స్ ని మంచి రేటుకి అమ్మారు, కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పడటం తో సినిమాలు అన్నీ పోస్ట్ పోన్ ల మంత్రం పాడుతుండగా కొన్ని సినిమాలు…

డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సినిమా కి కూడా సాలిడ్ OTT ఆఫర్స్ వచ్చినా కానీ టెంప్ట్ అవ్వకుండా నో చెప్పారు, ఇప్పుడు లాక్ డౌన్ టైం లోనే సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కంప్లీట్ అవ్వడం విశేషం…

సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ ఇది వరకు 3.2 కోట్ల రేటు కి కన్ఫాం అవ్వగా ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన మొదట రైట్స్ కొన్న వాళ్ళు వెనక్కి తగ్గారు, అది తగ్గడం కూడా మంచిది అయింది సినిమా కి, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే సినిమా ఏకంగా 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చెసుకుని దుమ్ము లేపింది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకుందట, ఇక శాటిలైట్ రైట్స్ ఇతర రైట్స్ కలిపి మరో 4.5 కోట్ల రేటు సొంతం అయ్యిందట ఈ సినిమా కి, దాంతో టోటల్ బిజినెస్ ను 9.5 కోట్ల రేటు కి కన్ఫాం చేసుకుంది ఈ సినిమా.

బాలయ్య గొప్పతనం…శ్రీకాంత్ కోసం కథల వేట!
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ బోయపాటి శ్రీను తో సింహా లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా అఖండ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య బోయపాటి మూవీస్ లో విలన్ రోల్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.

లెజెండ్ మూవీ లో జగపతిబాబు రోల్ ఏ రేంజ్ లో హైలేట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో విలన్ గా సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు జగపతిబాబు, ప్రస్తుతం హీరోగా కంప్లీట్ డౌన్ లో ఉన్న శ్రీకాంత్ కూడా అఖండలో విలన్ రోల్ చేస్తున్నాడు.

కాగా తన రోల్ పై స్పందించిన బాలయ్య శ్రీకాంత్ రోల్ అద్బుతంగా వచ్చిందని, కానీ అఖండ తర్వాత విలన్ రోల్స్ కే శ్రీకాంత్ పరిమితం అవ్వడం తనకి ఇష్టం లేదని, తనకి సూట్ అయ్యే కథలను నేను కూడా వెతికి ఇస్తానంటూ తన మంచి మనసును చాటుకున్నాడు బాలయ్య. మరి శ్రీకాంత్ కెరీర్ కి అఖండ ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here