మాస్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొనగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది కూడా ఆసక్తిగా మారింది ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా బిజినెస్ పరంగా మాత్రం…
బడ్జెట్ మీద అద్బుతమైన లాభాలను నిర్మాతలకు సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి. సినిమాను నిర్మాతలు 8 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించారు. సినిమా కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ కింద అన్నీ కలిపి ఏకంగా 12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.
దాంతో కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ కిందనే సినిమా 4.5 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా. సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ ముందు 11 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా జరగగా సాలిడ్ ప్రాఫిట్స్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రావడం తో తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఏరియాల్లో సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నారు.
ఆ బిజినెస్ వర్త్ 3 కోట్ల మేర ఉండగా ఆ బిజినెస్ ను పక్కకు పెడితే సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల మేర బిజినెస్ ను సాధించగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో 1 కోటి బిజినెస్ ను అందుకోగా టోటల్ బిజినెస్ 8 కోట్ల మేర ఉంది… దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే…..
8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమం వసూల్ చేయాల్సి ఉంటుంది. ఓన్ రిలీజ్ వర్త్ ని కూడా వెనక్కి తేవాలి అంటే 11.5 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సెకెండ్ పాండమిక్ తర్వాత ఇదే హైయెస్ట్… మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని ఈ బిజినెస్ ను అందుకుంటుందో చూడాలి.