Home టోటల్ కలెక్షన్స్ 1.2 కోట్ల సినిమా….టోటల్ కలెక్షన్స్ ఇవి…దారుణం అబ్బా!

1.2 కోట్ల సినిమా….టోటల్ కలెక్షన్స్ ఇవి…దారుణం అబ్బా!

2010
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ కన్నా ముందు భారీ పోటిలో రిలీజ్ అయిన సినిమా జై సేన, ఒకప్పుడు కొన్ని మంచి సినిమాలను డైరెక్ట్ చేసిన వి సముద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో సాలిడ్ స్టార్ కాస్ట్ నే పెట్టారు, అంటే అందులో చాలా వరకు ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయిన వాళ్ళే ఉన్నారు అనుకోండి, అయినా నోటబుల్ స్టార్స్ తో మీడియం రేంజ్ ప్రమోషన్ తర్వాత సినిమా ను జనవరి లో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

శ్రీకాంత్, తారకరత్న, సునీల్ మరియు శ్రీరాం రాంటి అందరూ నోటబుల్ యాక్టర్స్ ని సినిమాలో పెట్టి తీసిన ఈ పొలిటికల్ మూవీ రిలీజ్ అయిన మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏమంత ఆశాజనకంగా కలెక్షన్స్ రాలేదు.

కాగా సినిమా కోసం మొత్తం మీద 1.2 కోట్లను ఖర్చు చేశారని సమాచారం. ఇక సినిమాను రెండు తెలుగు రాష్ట్ర్రాలలో 100 నుండి 120 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేశారు. కాగా సినిమా కి మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం కి రెండు తెలుగు రాష్ట్రాలలో 16 లక్షల దాకా…

షేర్ అలాగే 30 లక్షల మేర గ్రాస్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి అని సమాచారం. అంటే బడ్జెట్ లో 25% కూడా రికవరీ చేయలేక పోయింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 35 లక్షల రేటు కి డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, ఇక శాటిలైట్ రైట్స్ అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ తో నిర్మాత మొత్తం మీద పెట్టిన బడ్జెట్ రికవరీ అవుతానని నమ్మకంగా ఉన్నారట.

కానీ అంత రికవరీ అయ్యే అవకాశం తక్కువగానే ఉందని చెప్పాలి. మొత్తం మీద భారీ నోటబుల్ స్టార్ కాస్ట్ తోనే వచ్చిన ఈ పొలిటికల్ మూవీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో మాత్రం విఫలం అయింది, చాలా మంది నోటబుల్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపక పోవడం విచార కరం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here