బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) రిమార్కబుల్ కలెక్షన్స్ తో 600 కోట్లకు పైగా వసూళ్ళతో సంచలనం సృష్టించగా సినిమాలో స్పెషల్ క్యామియోలు ఓ రేంజ్ లో వర్కౌట్ అవ్వగా రిపీట్స్ లో కూడా కుమ్మేసింది సినిమా…
కాగా ఇప్పుడు సినిమా పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా పార్ట్ 2 లో కూడా స్పెషల్ క్యామియోలను కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది…టాలీవుడ్ నుండి కూడా స్పెషల్ క్యామియో ఉంటుందని టాక్ గట్టిగానే ఉండగా…
వీటితో పాటు సినిమా రేంజ్ ని మరో లెవల్ కి తీసుకువెళ్ళే రేంజ్ లో ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ని ఒక స్పెషల్ క్యామియో రోల్ లో పెట్టడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని సమాచారం. ఇది వరకు షారుఖ్ నటించిన…
రా వన్ సినిమాలో రజినీకాంత్ రోబో గా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా ఈ సారి జైలర్2 కోసం షారుఖ్ ఖాన్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇది కనుక అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అయితే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ సూపర్ ఫాం లో ఉన్న షారుఖ్ అడ్వాంటేజ్ తో…
జైలర్2 కి స్కై లెవల్ లో అంచనాలు పెరిగిపోవడం ఖాయమని చెప్పాలి. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉండగా జైలర్ 2 మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఈ సారి ఈ స్పెషల్ క్యామియోలు అన్నీ నిజం అయితే కనుక నెక్స్ట్ లెవల్ లో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.