Home న్యూస్ #SSMB28 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్…రిలీజ్ ఎప్పుడంటే!!

#SSMB28 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్…రిలీజ్ ఎప్పుడంటే!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత రూపొందుతున్న హాట్రిక్ మూవీ అనౌన్స్ మెంట్ ఎప్పుడో జరిగినా కానీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా ఫైనల్ గా ఎట్టకేలకు మూవీ టీం నుండి అఫీషియల్ గా సినిమా గురించిన అనౌన్స్ మెంట్ రానే వచ్చింది….

   

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక సినిమా రిలీజ్ గురించి కూడా అనౌన్స్ మెంట్ లో అప్ డేట్ చేశారు…

సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు… మహేష్ బాబును సాలిడ్ మాస్ లుక్ తో త్రివిక్రమ్ మార్క్ ట్రీట్ మెంట్ తో సినిమా ఉండబోతుందని సమాచారం. బాక్ టు బాక్ 4 సార్లు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సూపర్ స్టార్ ఇక ఈ సినిమాతో ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here